తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్​@7PM - TOPTEN NEWS

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOPTEN NEWS @7PM
టాప్​టెన్ వార్తలు@7PM

By

Published : Jun 20, 2020, 6:58 PM IST

Updated : Jun 20, 2020, 7:04 PM IST

శుభవార్త..

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ చికిత్సకు ఔషధం సిద్ధమైంది. భారత ఫార్మా దిగ్గజం గ్లెన్‌మార్క్‌ కొత్త మందును ఆవిష్కరించినట్టు వెల్లడించింది. ఇప్పటికే మూడు దశల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది. మరి ఓక్కొ టాబ్లెట్​ ధర ఎంతో తెలుసా..?

భరోసా..

గల్వాన్​ లోయలో మృతి చెందిన కర్నల్ సంతోశ్ బాబు కుటుంబాన్ని సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్​ పరామర్శించనున్నారు. కర్నల్ కుటుంబానికి ప్రభుత్వ తరఫున ప్రకటించిన సాయాన్ని స్వయంగా కేసీఆర్​ అందించనున్నారు.

కడగకపోతే కనిపెట్టేస్తోంది

ప్రస్తుతం కరోనాకు వ్యాక్సిన్​ లేని కారణంగా మాస్క్​ ధరించడం, చేతులు కడుక్కోవడం తప్పనిసరి. అయితే కొందరు వాటిని నిర్లక్ష్యం చేస్తూ వ్యాధి వ్యాప్తికి కారణమవుతున్నారు. చేతుల శుభ్రతను ఎలా కనిపెడుతుందంటే..?

దేనికైనా రెడీ..

సర్పంచ్​ అంటే ఇలా ఉండాలని చేసి చూపించారు మహారాష్ట్రలోని ఓ మహిళ. ఎల్లప్పుడూ ప్రజలు బాగుండాలని కోరే మనీషా ఖేదార్​.. షిహూర్​ తాలుకాలోని పింప్రీ దములా గ్రామంలో ప్రజల శ్రేయస్సు కోసం ఏం చేసిందంటే..?

ఆందోళన ఎందుకు..

ఖగోళంలో ఆదివారం సంభవించనున్న వలయాకార సూర్యగ్రహణంపై ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడే సూర్యగ్రహణ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఎంత వరకు ఉంటుంది..?

పంతులమ్మకే టోకరా..

ఓ ఘరానా మోసగాడు డేటింగ్ యాప్ పరిచయమైన పరిచయమైన ఉపాధ్యాయురాలిని 3 3 .34 లక్షలు కొట్టేసిన ఘటన బెంగళూరులో వెలుగు చూసింది. ఇలా ఎంతమందిని మోసం చేశాడు.

నె'ట్టాసనాలు'..!

అంతర్జాతీయ యోగా డే(జూన్​ 21) వేడుకలను ఈసారి పూర్తిగా డిజిటల్​ ప్లాట్​ఫాంలలోనే నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో సమూహాలుగా ఏర్పడకూడదని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. యోగా డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏం సందేశం ఇవ్వనున్నారు?

బలం పెరిగింది

పెద్దల సభలో కమళ దళానికి బలం పెరుగుతోంది. శుక్రవారం ఎన్నికల్లో 8 స్థానాలు కైవసం చేసుకున్న భాజపా.. ఎగువ సభలో తన బలాన్ని 86 కు పెంచుకుంది. ఇదే సమయంలో... విపక్ష కాంగ్రెస్ పార్టీ బలం 41 పరిమితమైంది. అధికార భాజపాకు మిత్రపక్షాలతో వచ్చే ఇబ్బందులేంటి..?

చాక్లెట్​ 'దాదా '

కరోనాపై అలుపెరుగని పోరాటం చేస్తోన్న వైద్యులకు సంఘీభావం తెలిపారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ. వారికి కృతజ్ఞత తెలుపుతూ ప్రముఖ చాక్లెట్ల తయారీ కంపెనీ మార్స్​ వ్రింగ్లీ చాక్లెట్లను పంపిణీ చేశారు. అండగా ఉంటామని వైద్యులకు దాదా భరోసా..

బాలయ్యా.. మజాకా..

నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఒకే సమయంలో 21 వేల కేకులను కట్​ చేశారు అభిమానులు. ఈ వేడుకను పర్యవేక్షించిన గిన్నీస్​ బుక్​ ఆఫ్ వరల్డ్​​ రికార్డ్స్​ ప్రతినిధులు, అరుదైన రికార్డుగా దీనిని నమోదు చేశారు. సంబంధిత పత్రాలు బాలకృష్ణకు త్వరలో అందజేయనున్నారు.

Last Updated : Jun 20, 2020, 7:04 PM IST

ABOUT THE AUTHOR

...view details