తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @ 5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 5PM
టాప్​టెన్​ న్యూస్​ @ 5PM

By

Published : Jul 19, 2021, 4:59 PM IST

నన్ను చంపడానికి కుట్ర: ఈటల

పాదయాత్రలో ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాదయాత్రలో జాగ్రత్తగా ఉండాలని మాజీ నక్సలైట్ సమాచారం ఇచ్చాడని ఆయన తెలిపారు. నన్ను చంపడానికి జిల్లా మంత్రి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఏపీ ప్రభుత్వ పిటిషన్​ కొట్టేసిన సుప్రీం

అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంశంపై ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ అంశంపై లిఖితపూర్వక ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'అందుకే ఆ కథనాలు'

ఫోన్‌ హ్యాకింగ్‌ అంశంపై ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ లోక్​సభలో ప్రకటన చేశారు. ఫోన్‌ హ్యాకింగ్‌పై ఓ వెబ్‌ పోర్టల్‌లో సంచలనాత్మక కథనాలను ఉద్దేశపూర్వకంగానే ప్రచురించినట్లు పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకే ఇలా చేసినట్లు ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మరో రెండు రోజులు

రాష్ట్రంలో ఇవాళ, రేపు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల మూడ్రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అందుకే చంపేశారు.!

కత్తులతో సావాసం చేసిన ఓ రౌడీషీటర్ చివరకు కత్తి పోటుకే బలయ్యాడు. చాదర్​ఘాట్ పరిధిలో రౌడీషీటర్ల చేతిలో ప్రాణాలు కోల్పోయిన రౌడీషీటర్ కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు కారకులైన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

వివాదానికి తెరపడినట్టేనా?

పంజాబ్​ పీసీసీ అధ్యక్షుడిగా నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ నియమితులైన సందర్భంగా కొత్త కార్యవర్గం.. ఆ రాష్ట్ర మంత్రి త్రిపట్​ రాజిందర్​ సింగ్​ బజ్వా నివాసంలో తొలిసారి సమావేశమైంది. ఈ సందర్భంగా నేతలంతా ఫొటోలకు పోజులిచ్చారు. పార్టీ ఐక్యంగా ఉందని తెలిపారు పీసీసీ మాజీ అధ్యక్షుడు సునీల్​ జఖర్​. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కొడుకు కేంద్ర మంత్రి అయినా తప్పలేదు.!

కేంద్ర మంత్రి పదవిలో ఉన్న ఓ వ్యక్తి తల్లిదండ్రులు.. వ్యవసాయ కూలీ పనులు చేస్తారంటే నమ్మగలరా? ప్రభుత్వం ఇచ్చే సాయం కోసం అందరితో పాటే క్యూలో నిల్చొంటారంటే ఊహించగలరా? కానీ, కేంద్ర మంత్రి ఎల్​.మురుగన్ తల్లిదండ్రులను చూస్తే నమ్మి తీరాల్సిందే. ఇప్పటికీ వారు తమ ఊరిలోనే వ్యవసాయ పనులకు వెళ్తూ నిరాడంబరంగా జీవిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

భారీ నష్టాలు

వారంలో మొదటి రోజును (సోమవారం) భారీ నష్టాలతో ముగించాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ (Sensex Today) 587 పాయింట్లు తగ్గి.. 52,600 దిగువకు చేరింది. నిఫ్టీ (Nifty Today) 171 పాయింట్ల నష్టంతో 15,800 మార్క్​ను కోల్పోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మీరిదీ గమనించారా!

గత నాలుగేళ్లలో వన్డే క్రికెట్​లో అత్యధిక కెప్టెన్లను ప్రయోగించిన జట్టుగా శ్రీలంక తొలి స్థానంలో నిలిచింది. 2017 నుంచి ఇప్పటివరకు 10మంది ఆటగాళ్లను సారథులుగా నియమించింది. ఇక ఇండియా విషయానికొస్తే నలుగురు ప్లేయర్లు కెప్టెన్లుగా వ్యవహరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సందీప్​ వంగా 'పవర్'​ఫుల్ మెమోరీస్..

'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. పవన్​ కల్యాణ్​పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే పలువురు సాఫ్ట్​వేర్ ఇంజినీర్లు సంయుక్తంగా తెరకెక్కించిన 'క్షీరసాగర మథనం' మూవీ రిలీజ్ డేట్​ను ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details