1. అభినందనలు..
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను... కొత్తగా ఎన్నికైన జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్, తెరాస కార్పొరేటర్లు కలిశారు. సీఎం కేసీఆర్ వారికి అభినందనలు తెలిపారు. పేదల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. అభివృద్ధే లక్ష్యం
హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్‌గా ఎన్నికవడంపై విజయలక్ష్మి, శ్రీలత హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని పార్టీలతో కలిసి నగరాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. పీఠాలను తెరాస కైవసం చేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. సహించం..
తెరాస, మజ్లిస్ దోస్తీ మరోసారి బయటపడిందని భాజపా నేతలు విమర్శలు గుప్పించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాము చెప్పిందే నిజమైందని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పొత్తు లేదని చెబుతూనే ఎన్నికల్లో కలిసి పోటీచేశాయని ఆరోపించారు. హైదరాబాద్‌ను తమ పార్టీ కార్పొరేటర్లు కంటికి రెప్పలా కాపాడుకుంటారని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ధనికుల బడ్జెట్
దేశంలోని ధనికుల కోసమే బడ్జెట్ ప్రవేశపెట్టిందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. ఒక్క శాతం వ్యక్తులకు మాత్రమే ఇది ప్రయోజనం చేకూరుస్తుందని వ్యాఖ్యానించింది. ఈ బడ్జెట్‌ను తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ఎవరైనా.. తప్పవ్
సామాజిక మాధ్యమాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. హింసను రాజేసేందుకు వీటిని ఉపయోగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. భారత్‌లోని చట్టాలకు అనుగుణంగా సోషల్ మీడియాలు నడుచుకోవాలని హితవు పలికింది. ఒక్కో దేశంలో ఒక్కో విధానాలు అనుసరించడం తగదని సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.