1. 'పది' షెడ్యూల్
పదో తరగతి పరీక్షల టైం టైబుల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. మే 17 నుంచి 26 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఆరు పరీక్షలే ఉంటాయని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. అదే నా కోరిక..
తెలంగాణలో రాజన్న రాజ్యం మళ్లీ రావాలని ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల ఆకాంక్షించారు. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసు కదా అన్నారు. విద్యార్థులు ఉచితంగా చదువుకుంటున్నారా అని ప్రశ్నించారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తేవాలన్నదే తన కోరిక అని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. విభేదాల్లేవ్..
తెలంగాణలో వైకాపా వంటి పార్టీ ఉండాలని షర్మిల భావించారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. షర్మిల నిర్ణయం పట్ల జగన్ కాస్త బాధపడి ఉండొచ్చొని... షర్మిలకు జగన్ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని స్పష్టం చేశారు. షర్మిలను పార్టీ పెట్టవద్దని నచ్చజెప్పే ప్రయత్నాలు జరిగాయని సజ్జల చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ఫేస్బుక్ లైవ్‌తో..
ఉత్తరాఖండ్ జలప్రళయాన్ని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి మన్వర్ సింగ్‌తో ఈటీవీ భారత్ మాట్లాడింది. ఆ విధ్వంసం చూసి ఒళ్లు జలదరించిందని అతను తెలిపాడు. జలవిలయం దృశ్యాలను మొదటగా అతనే ఫోన్లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. అనంతరం అవి వైరల్‌గా మారాయి. అధికారులు అప్రమత్తమై యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ఆరోజు అసలు ఏం జరిగిందో స్వయంగా అతని మాటల్లోనే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. రద్దు బిల్లు..
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని లోక్‌సభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. పంజాబ్‌కు చెందిన ఎంపీల బృందం దీన్ని తీసుకురానున్నట్లు ఆ పార్టీ ఎంపీ మనీశ్ తివారీ తెలిపారు. రాజ్యసభలోనూ ఇలాంటి బిల్లును ప్రవేశపెట్టాలని యత్నిస్తున్నట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.