1. సంక్షేమమే మా ధ్యేయం
సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లి క్లస్టర్‌లో నిర్మించిన రైతు వేదికను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ప్రైవేటు చేతుల్లోకి..
కేంద్ర బడ్జెట్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా స్పందించారు. లాక్డౌన్ తర్వాత మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ప్రజలను తీవ్రంగా నిరుత్సాహపరిచిందని అభిప్రాయపడ్డారు. దేశాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పుతున్నారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. వాటా తగ్గింది..
కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో రాష్ట్రానికి పన్నుల వాటా తగ్గింది. గతంతో పోలిస్తే 2 వేల 736 కోట్ల మేర తగ్గిస్తూ.. 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. ఫలితంగా 13వేల 990 కోట్లు కేంద్రం నుంచి రానున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. అనుకూలమా? కాదా?
భాజపా నేతలు, కార్యకర్తలపై తెరాసయే దాడులు ప్రారంభంచిందని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. దాడులకు వ్యతిరేకంగా రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్టు తెలిపారు. రామమందిరం నిర్మాణానికి విరాళాల సేకరణలో భక్తులుగా పాల్గొంటున్నామని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. సంక్షేమ బడ్డెట్..!
కరోనా కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మౌలిక వసతులు తదితర రంగాలకు వార్షిక పద్దులో పెట్టపీట వేశారు. ఉద్యోగాల సృష్టి, గ్రామీణాభివృద్ధి, భారత్‌లో తయారీ, పెట్టుబడుల ఆకర్షణపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. మరోవైపు సెస్ పేరుతో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యులపై అదనపు భారం మోపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.