1. త్వరలో భృతి..!
రాష్ట్రంలోని నిరుద్యోగులకు త్వరలో శుభవార్త చెప్పనున్నట్టు మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేపోమాపో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగ భృతి ప్రకటించనున్నట్టు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. విద్యుత్ ఉద్యోగుల శ్రమతో..
రాష్ట్రావతరణ అనంతరం తొలి ప్రాధాన్యతగా విద్యుత్ సమస్యను పరిష్కరించినట్టు... కేటీఆర్ అన్నారు. విద్యుత్ కార్మిక సంఘం సమావేశానికి హాజరైన మంత్రి... ప్రత్యేక ఉద్యమంలో విద్యుత్ ఉద్యోగులు కీలకపాత్ర పోషించారని కొనియాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. తిరగబడాలి..
తెలంగాణ వచ్చాక ఉద్యోగులను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. ఉద్యోగులకు 43శాతం తగ్గకుండా ఫిట్మెంట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. అది నేరమేం కాదు..
పోక్సో చట్టం ప్రకారం దుస్తులపై కాకుండా, నేరుగా శరీరాన్ని తాకితేనే లైంగిక దాడిగా పరిగణించాలని వివాదాస్పద తీర్పు ఇచ్చిన బాంబే హైకోర్టు న్యాయమూర్తి మరోసారి అలాంటి తీర్పే వెలువరించారు. మైనర్ బాలిక చేయి పట్టుకోవటం, ప్యాంటు జిప్పు విప్పడం పోక్సో చట్టం ప్రకారం లైంగిక దాడిగా భావించలేమని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. కేంద్రానికి నోటీసులు..
కొత్త వ్యవసాయ చట్టాల రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ కేరళ ఎంపీ దాఖలు చేసిన వ్యాజ్యంపై కేంద్రానికి నోటీసులు ఇచ్చింది సుప్రీం కోర్టు. తమ స్పందన తెలియజేయాలని ఆదేశించింది. తాజా పిటిషన్‌ను పెండింగ్‌లో ఉన్న పిటిషన్లతో జత చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.