1. ఎలా జరుగుతున్నాయ్..
కొత్త సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. పనుల పురోగతిపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. మంత్రులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో కలిసి నిర్మాణ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. రామయ్య కల్యాణానికి ముహూర్తం
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు భద్రాద్రి రామయ్య కల్యాణ మహోత్సవానికి మహూర్తం కుదిరింది. ఏప్రిల్ 21న కళ్యాణ మహోత్సవం నిర్వహించేందుకు వైదిక కమిటీ తేదీలు ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. భార్యపై కోపంతోనే..!
16 మందిని హత్యచేసిన సీరియల్ కిల్లర్ కేసులో పోలీసులు విస్తుపోయే విషయాలు వెల్లడించారు. మొదటి భార్య వదిలేయడంతో మహిళలపై కక్ష పెంచుకున్నాడని సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. నిందితుడు 2003 నుంచి వరుస నేరాలకు పాల్పడ్డాడని... అన్ని ఘటనల్లోనూ మహిళలే బాధితులని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. దద్దరిల్లిన దిల్లీ..
నిరసనలతో దేశ రాజధాని దిల్లీ మరోమారు దద్దరిల్లింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఇన్ని నెలలుగా శాంతియుతంగా సాగుతున్న రైతుల ఆందోళనలు.. ట్రాక్టర్ ర్యాలీతో ఉద్రిక్తంగా మారాయి. నిబంధనలకు తూట్లు పొడుస్తూ.. నిరసనకారులు దిల్లీలోనే అనేక ప్రాంతాలకు దూసుకెళ్లారు. ఎర్రకోటపై రైతు జెండాలను ఎగురవేశారు. అనేక ప్రాంతాల్లో పోలీసులు-నిరసనకారుల మధ్య ఘర్షణ చెలరేగింది. మరోవైపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రాంతాల్లో అంతర్జాల సేవలను నిలిపివేశారు అధికారులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. దీదీకి షాక్..
తృణమూల్ కాంగ్రెస్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ పదవులు రాజీనామా చేస్తున్నట్లు ఉత్తర్పారా ఎమ్మెల్యే ప్రబీర్ ఘోషల్ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.