1. భయమక్కర్లేదు..
కొత్త రకం వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. త్వరలో క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలు ఉన్నందున... కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని సూచించారు. త్వరలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని... పంపిణీకి శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. రుణ యాప్‌లపై కొరడా..
రుణ యాప్‌ల దందాపై సైబరాబాద్ పోలీసులు కొరడా ఝళిపించారు. దా'రుణ' యాప్‌ల ద్వారా వేధింపులకు పాల్పడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 22 చరవాణులు, 3 కంప్యూటర్లు, 3 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. రూ.1.52 కోట్లు నిల్వ ఉన్న 18 బ్యాంకు ఖాతాలు నిలుపుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ప్రభుత్వం అవమానిస్తోంది..
హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన ఆధ్వర్యంలో నిర్వహించిన సత్యగ్రహ దీక్షలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొన్నారు. తెరాస ప్రభుత్వంపై భట్టి ధ్వజమెత్తారు. స్థానిక ప్రజా ప్రతినిధులను తెరాస ప్రభుత్వం అవమానిస్తోందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. రాకపోతే తప్పుకుంటారా..?
భాజపా నాయకులకు మరో సవాల్ విసిరారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 200 సీట్లు రాకపోతే ఆ పార్టీ నేతలు పదవుల నుంచి తప్పుకుంటారా? అని ఛాలెంజ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. చర్యలేవీ..?
న్యాయస్థానాన్ని ఆలస్యంగా ఆశ్రయిస్తున్న ప్రభుత్వ అధికారులపై సుప్రీంకోర్టు మండిపడింది. ఏదో లాంఛనప్రాయంగా కోర్టులో అపీళ్లు దాఖలు చేస్తున్నారని చీవాట్లు పెట్టింది. ఓ తీర్పుపై 462 రోజులు ఆలస్యంగా సవాలు చేసిన పిటిషనర్‌కు రూ.15 వేలు జరిమానా విధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.