1. భాగమవుతారా..?
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన 'కోవాగ్జిన్’ టీకా మూడో దశ మానవ ప్రయోగాలకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనుమతి లభించింది. ఇందుకు సంబంధించిన ప్రయోగాలను ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేపట్టనున్నారు. అయితే వీటిలో వలంటీర్లుగా పాల్గొనాలనుకునే వారి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. యూపీ నుంచి గరికపాటి..!
ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే వారిలో తెలుగు వ్యక్తి కూడా ఉండబోతున్నారు. మాజీ ఎంపీ గరికపాటి మోహనరావు పేరు ఈ జాబితాలో ఉండనున్నట్లు సమాచారం. తెలంగాణ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభ సీటు దక్కించుకున్న గరికపాటి.. అనంతరం భాజపాలో చేరారు. నాటి హామీ మేరకు కమలం పార్టీ అగ్రనాయకత్వం యూపీ నుంచి రాజ్యసభకు గరికపాటి పేరుక ఖరారు చేసినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3.ఎన్నికల సోదాలు..
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నికలో భాజపా తరపున పోటీ చేస్తున్న రఘునందర్‌రావు బంధువు ఇంట్లో పోలీసులు, రెవెన్యూ అధికారులు సోదాలు చేశారు. ఆ తనిఖీల్లో రూ. 18.67 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. డ్యాం నిర్మాణానికే ఇస్తాం..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. సమాచార హక్కు చట్టం కింద దాఖలు చేసిన అర్జీకి సమాధానమిస్తూ వివరాలు తెలిపింది. ఆర్టీఐ ద్వారా ప్రాజెక్టు నిర్మాణం, పునరావాసం, పరిహారానికి సంబంధించిన అంశాలు వెలుగులోకి వచ్చాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. కమిటీ రద్దు
దేశ రాజధాని దిల్లీలో కాలుష్యానికి కారణమవుతున్న పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం నివారణ చర్యలను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీని నిలిపివేసింది సుప్రీంకోర్టు. కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం సమగ్ర చట్టం చేయనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ధర్మాసనం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.