1. హాథ్రస్‌కు రాహుల్
దిల్లీ-నోయిడా వంతెన వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాహుల్ గాంధీని హాథ్రస్ పర్యటనకు అనుమతినిచ్చినప్పటికీ.. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. బోగస్ ఓట్లకు యత్నం
జీహెచ్ఎంసీ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం ముగిసింది. అఖిలపక్ష భేటీకి జిల్లా ఎన్నికల అధికారి రాకపోవడం సరికాదని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో రిజర్వేషన్లు మార్చకుండా ఆర్డినెన్స్ తెచ్చే యత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి రిజర్వేషన్లు సరిచేసి ఎన్నికలు నిర్వహించాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. మోదీ మరో నిర్ణయం
హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. మనాలీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్ర ప్రజల కోసం హమీర్‌పుర్‌లో 66 మెగా వాట్ల ధౌలసిద్ధ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు వల్ల దేశానికి విద్యుత్ సరఫరాతో పాటు స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. గల్వాన్ వీరులకు స్మారకం
గల్వాన్‌లో చైనా సైన్యంతో భీకరంగా పోరాడి వీర మరణం పొందిన సైనికులకు గుర్తుగా యుద్ధ స్మారకం నిర్మించారు. దౌలత్ బేగ్ ఓల్డీ రహదారికి సమీపంలో ఉన్న కేఎం-120 స్థావరం వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. బిహార్ బరిలో మజ్లిస్
బిహార్ ఎన్నికల పర్వాలు రసవత్తరంగా సాగుతున్నాయి. పొత్తులు-పైఎత్తులతో ప్రత్యర్థిని చిత్తు చేసేందుకు అన్ని పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. బిహార్ బరిలో నిలిచిన అసదుద్దీన్ ఓవైసీ పార్టీ ఎంఐఎం... తన బద్ధవిరోధ కూటమి ఎన్డీఏ నెత్తిన పాలు పోసే అవకాశాలు ఉన్నాయంటున్నారు బిహార్ ఈటీవీ భారత్ బ్యూరో చీఫ్ అమిత్ భెలారీ. ప్రతిపక్ష ఆర్జేడీ ముస్లిం ఓట్లను.. ఎంఐఎం చీల్చటం భాజపా మిత్రపక్షాలకు కలిసొస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.