తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​ టెన్ న్యూస్@5pm - topten news @5pm

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @5pm
టాప్​టెన్ న్యూస్@5pm

By

Published : Sep 18, 2020, 4:57 PM IST

1. పారిపోతున్నారు..

హైదరాబాద్​ శివార్లలో ఇళ్లు కట్టినా.. అవి నగరవాసులకే అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 10 శాతం ఇళ్లు స్థానికులకు, 90 శాతం ఇళ్లు హైదరాబాద్​ ప్రజలకే ఇస్తామని స్పష్టం చేశారు. లక్ష ఇళ్లకు సంబంధించి జాబితా కాంగ్రెస్​ నేతలకు ఇస్తామని.. దాని ప్రకారం వాళ్లే తిరిగి చూసుకోవచ్చన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. స్థలం చూపించాలా..?

గత మున్సిపల్ ఎన్నికల్లో చూపించిన ఇళ్లనే ఇప్పుడు చూపిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. లక్ష ఇళ్లు చూపిస్తామని ఇప్పటి వరకు కేవలం 3,428 ఇళ్లనే చూపించారన్నారు. ఇవాళ చూపించిన తుక్కుగూడ, రాంపల్లి ప్రాంతాలు జీహెచ్ఎంసీ పరిధిలోకి రావన్నారు. గ్రేటర్ పరిధిలో వందల ఎకరాల భూమి ఉందని... అక్కడ కట్టవచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. 'వైద్యా'నికి ఆమోదం

హోమియోపతి, భారతీయ కేంద్ర వైద్య మండలి సవరణ బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ రెండు బిల్లులకు ఈనెల 15నే లోక్​సభ ఆమోదించగా.. ఏప్రిల్​లో తీసుకొచ్చిన ఆర్డినెన్స్​ల స్థానంలో అమలులోకి రానున్నాయి. వీటితో పాటు ఎంపీలు, మంత్రుల జీతాల్లో కోత విధించేందుకు తీసుకొచ్చిన బిల్లులకు మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది ఎగువసభ. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. ఫోన్​లో మోదీతో పుతిన్

భారత్​-రష్యా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేయాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా.. ఫోన్​లో సంభాషించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. మోదీ కూడా అదే రీతిలో స్పందించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. షరీఫ్ అరెస్టు!

పాకిస్థాన్​ మాజీ ప్రధాని నవాజ్​ షరీఫ్​పై అరెస్ట్​ వారెంట్​ జారీ అయింది. చికిత్స నిమిత్తం లండన్​ వెళ్లి అక్కడే తలదాచుకుంటున్నారు షరీఫ్​. ఈ తరుణంలో లండన్​లోని తమ రాయబారి కార్యాలయం​ ద్వారా అరెస్ట్​ వారెంట్​ పంపింది పాక్​ సర్కార్. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. నష్టాలతో ముగింపు

స్టాక్ మార్కెట్లు వారాంతంలో నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 134 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ స్వల్పంగా 11 పాయింట్లు నష్టపోయినా.. 11,500 మార్క్​ను దక్కించుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. పేటీఎం ఔట్..

ప్రముఖ డిజిటల్​ పేమెంట్స్​ సంస్థ పేటీఎంను తమ 'ప్లే స్టోర్'​ నుంచి తొలగించింది గూగుల్​. పేటీఎంతో పాటు పేటీఎం ఫస్ట్​ గేమ్స్​ను కూడా తీసివేసింది. గ్యాబ్లింగ్​ నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ వేటు వేసినట్లు స్పష్టం చేసింది గూగుల్​ సంస్థ. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. గాయంతో దూరం..

టెన్నిస్​ స్టార్​ ప్లేయర్ నవోమి ఒసాకా, ఫ్రెంచ్​ ఒపెన్​ నుంచి తప్పుకుంది. ఎడమ కాలికి అయిన గాయం ఇంకా తగ్గకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్వీట్ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. ఎమ్మెల్యే టికెట్ కావాలి..

లాక్​డౌన్​లో వలసకూలీలు సొంతూళ్లు వెళ్లడానికి బస్సు, రైలు, విమానాల టికెట్లు అందించిన నటుడు సోనూసూద్​ను ఓ నెటిజన్ ఆశ్చర్యకరమైన కోరిక కోరాడు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగల్​పూర్​ నుంచి భాజపా తరఫున టికెట్​ ఇప్పించాలని కోరాడు. దానికి నవ్వుతూ చమత్కరించారు సోనూ. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. సూర్యకు కోర్టు వార్నింగ్..

న్యాయవ్యవస్థ పనితీరు గురించి మాట్లాడటం తగదని హీరో సూర్యకు మద్రాస్ హైకోర్టు హితవు పలికింది. విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో చేసిన ట్వీట్లపై స్పందిస్తూ ఈ విధంగా తీర్పునిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details