1. సరిహద్దుల్లో సొరంగం
భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దుకు అతి సమీపంలో ఓ సొరంగాన్ని బీఎస్ఎఫ్ గుర్తించింది. జమ్ములోని సరిహద్దు కంచెకు దగర్లో సొరంగం ఉన్నట్లు తెలిపింది. భారత్ వైపు 50 మీటర్లు వరకు ఉన్న ఈ సొరంగ మార్గం 25 మీటర్ల లోతు ఉంది. అందులో 8 నుంచి 10 ప్లాస్టిక్ ఇసుక సంచులను స్వాధీనం చేసుకున్నారు. వాటిపై 'కరాచీ' అని రాసి ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ఛార్జీలు పెంపు
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వంట ఛార్జీలను ప్రభుత్వం పెంచింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వంట ధరలు పెంచారు. ప్రాథమిక పాఠశాలలో ఒక్కో విద్యార్థి వంటధరను రూ.4.48 నుంచి రూ. 4.97కు పెంచారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో వంట ధర రూ.6.71 నుంచి రూ.7.45కు పెంచారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ప్రయత్నాలు ఫలించాయ్..
రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు తగ్గించటంలో ప్రభుత్వ ప్రయత్నాలు పూర్తిగా ఫలించాయని పురపాలక మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల చురుకైన భాగస్వామ్యం వల్లే ఇది సాధ్యమైందని ట్విట్టర్ వేదికగా మంత్రి హర్షం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. డిజిటల్ భారత్..
డిజిటల్ విప్లవంలో భారత్ ప్రగతి బాటలో పయనిస్తూ కీలక దశకు చేరుకుందని ఒమిడియార్ నెట్వర్క్ ఇండియా నివేదించింది. డిజిటలీకరణలో ప్రపంచంలోనే భారత్ గొప్ప ఉదాహరణగా నిలిచినట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. అధ్యక్షుడు రాహులే..!
పార్టీలో సంస్థాగత ప్రక్షాళన, పూర్తిస్థాయి అధ్యక్షుడి ఎన్నిక అంశాలతో 23 మంది కాంగ్రెస్ సీనియర్లు రాసిన లేఖ సృష్టించిన ప్రకంపనలు.. ఆ పార్టీలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. శశి థరూర్, ఆజాద్, జితిన్ ప్రసాద్ వంటి నాయకులపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలో పరిస్థితుల గురించి పలు విషయాలు వెల్లడించారు కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.