తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్@5pm

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @5pm
టాప్​టెన్ న్యూస్@5pm

By

Published : Aug 25, 2020, 5:01 PM IST

1. పుల్వామా చార్జిషీట్

పుల్వామా ఉగ్రదాడి కేసులో 18 నెలల తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ ఛార్జిషీటు దాఖలు చేసింది. ఇందులో జైషే మహ్మద్​ అధినేత మసూద్​ అజర్​ సహా 19 మంది పేర్లు ప్రస్తావించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. ఇంట్లో పాఠాలు చక్కని అవకాశం

ఇంట్లోనే పాఠాలు నేర్చుకోవడం ఓ చక్కటి అవకాశమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఇదే సమయంలో మారుమూల గ్రామాల్లో ఆన్‌లైన్‌ బోధన సవాల్‌గా స్వీకరించి పాఠాలను అందించాలని సూచించారు. విద్యార్థుల్లో ఆన్‌లైన్ బోధనపై ఆసక్తి పెంచి ప్రోత్సహించాలని చెప్పారు. ఆన్‌లైన్ విద్య అవకాశాలు, సవాళ్లు అన్న అంశంపై వరంగల్ నిట్ నిర్వహించిన జాతీయ వెబినార్‌ను గవర్నర్ ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. ఆన్​లైన్ తరగతులు

సెప్టెంబరు 1 నుంచి ప్రభుత్వ కళాశాలల్లో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు జరపాలని విద్యాశాఖ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. వెంటిలేటర్​పైనే దాదా

ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని ఆర్మీ ఆస్పత్రి తెలిపింది. ఆరోగ్య సూచీలన్నీ నిలకడగానే ఉన్నట్లు స్పష్టం చేసింది. వెంటిలేటర్​పై చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. నాణ్యత కేంద్రాలు

జాతీయ శుద్ధ వాయు కార్యక్రమానికి సంబంధించి కేంద్రం తీరుపై జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కొంత పరిమితికి మించి కాలుష్యాన్ని తగ్గించలేమని చేసిన కేంద్రం వాదన.. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. ఆరు నెలల్లోగా దేశవ్యాప్తంగా 175 వాయు నాణ్యత పరిశీలన కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. రష్యా సంప్రదింపులు

రష్యా కరోనా టీకా 'స్పుత్నిక్-వి'ని ఉత్పత్తి చేసేందుకు సహకారాన్ని కోరుతూ ఆ దేశ రాయబారి భారత అధికారులను సంప్రదించారు. ప్రధాన శాస్త్రీయ సలహాదారు విజయ్ రాఘవన్, వైద్య పరిశోధన కార్యదర్శి బలరాం భార్గవ, జీవ సాంకేతిక శాఖ కార్యదర్శి రాణు స్వరూప్​ను కలిసి చర్చించినట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. కిమ్ 'అణు'మానాలు

ఉత్తర కొరియా నాయకుడు కిమ్​ జోంగ్ ఉన్ ఏం చేసినా సంచలనమే అవుతుంది. తాజాగా ఆయన ఏం చేయకుండానే వార్తల్లో నిలిచారు. ఆయన కొన్నాళ్ల నుంచి బయటి ప్రపంచానికి కనిపించడం మానేశారు. దీంతో కిమ్‌ కోమాలోకి వెళ్లిపోయారని వార్తలు గుప్పుమన్నాయి. ఆయన సోదరి కిమ్‌ యో జోంగ్‌ మెల్లిగా అధికార దండాన్ని అందుకొంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. లాభాలతో ముగింపు..

స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 45 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 6 పాయింట్లు పుంజుకుంది. సెషన్ మొత్తం ఒడుదొడుకులకు ఎదుర్కొన్న సూచీలు.. ఆర్థిక షేర్ల దన్నుతో చివరకు స్వల్ప లాభాలను నమోదు చేయడం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. పాంటింగ్​తో అశ్విన్..!

క్రికెట్​లో మన్కడింగ్​ పద్దతిపై ప్రస్తుతం జోరుగా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే దిల్లీ క్యాపిటల్స్​ కోచ్​ రికీ పాంటింగ్​తో చర్చలు జరిపినట్లు జట్టు బౌలర్​ అశ్విన్​ తెలిపాడు. వచ్చే వారం వివరాలను వెల్లడిస్తానని తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. విజయ్ ప్రియనేస్తాలు

టాలీవుడ్​ హీరో విజయ్​ దేవరకొండ తన ప్రియనేస్తాలంతో సరదాగా ఆడుకుంటూ కనిపించారు. ఆ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఇటీవలే మోస్ట్​ డిజైరబుల్​ మెన్​ జాబితాలో దేశంలోనే మూడో స్థానంలో నిలిచారు ఈ రౌడీహీరో. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details