తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @3PM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @3PM
టాప్​టెన్​ న్యూస్​ @3PM

By

Published : Feb 9, 2021, 3:00 PM IST

1. రాజన్న రాజ్యం తెస్తా..

తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని ఏపీ ముఖ్యమంత్రి సోదరి వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. హైదరాబాద్ లోటస్​పాండ్​లో అభిమానులు, వైకాపా నేతలతో షర్మిల సమావేశమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. ఫ్యాక్షన్​కు తావులేదు

రాష్ట్రంలో షర్మిల పార్టీ ప్రయత్నాలపై మంత్రి గంగుల కమలాకర్​ స్పందించారు. రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయం లేదన్న మంత్రి... తెలంగాణలో ఫ్యాక్షనిజం అంగీకరించబోమని ఎద్దేవా చేశారు. మరోవైపు బీసీ కోసం భాజపా చేస్తున్న పాదయాత్రపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. జల ప్రళయంలో 31 మంది మృతి

ఉత్తరాఖండ్​లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు గల్లంతైనవారి కోసం గాలిస్తున్నాయి. తపోవన్ విద్యుత్​ కేంద్రం వద్ద ఉన్న రెండో సొరంగంలో వంద మీటర్ల వరకు శిథిలాలను తొలగించినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటివరకు 31 మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. ఆపరేషన్ ఉత్తరాఖండ్

ఉత్తరాఖండ్​ విపత్తుపై రాజ్యసభలో ప్రకటన చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. ప్రస్తుతం వరద ముప్పు తొలిగిపోయిందని తెలిపారు. ఐటీబీపీ, సైన్యం, నౌకాదళానికి చెందిన బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. గర్విస్తున్నా..

పాకిస్థాన్​ పరిస్థితుల గురించి చదివినప్పుడు తాను భారత ముస్లింగా గర్వపడతానని చెప్పారు కాంగ్రెస్​ సీనియర్​ నేత గులాం నబీ ఆజాద్​. తన రాజకీయ జీవితంలో ఎంతో నేర్చుకున్నట్లు రాజ్యసభలో పదవీ విరమణకు ముందు చేసిన ప్రసంగంలో తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. ట్విట్టర్ చర్చలు

1,178 ట్విట్టర్ ఖాతాలపై వేటు వేయాలన్న ప్రభుత్వ ఆదేశాలపై కేంద్ర ఐటీ మంత్రితో అధికారిక చర్చలు జరుపుతున్నట్లు సంస్థ తెలిపింది. రైతు నిరసనలపై దుష్ప్రచారం చేస్తున్నాయని.. ఈ ఖాతాలపై నిషేధం విధించాలని కేంద్రం కోరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. నవ్వితే నొప్పి ఉండదు

కరోనా టీకాను నవ్వుతూ తీసుకోవాలని సూచిస్తున్నారు కాలిఫోర్నియా పరిశోధకులు. మనసారా నవ్వితే సూది నొప్పి 40 శాతం వరకు తగ్గుతుందని చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. వారసులొస్తున్నారు

మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్​ తెందూల్కర్​ వారసుడు అర్జున్​.. ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​లో అరంగేట్రం చేయనున్నాడు. గత కొన్నేళ్లుగా ముంబయి ఇండియన్స్​ జట్టు నెట్​ బౌలర్​గా పనిచేసిన అతడు.. ఈసారి ఐపీఎల్​ వేలంలో పాల్గొని తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ సందర్భంగా ఐపీఎల్​లో ఆడిన ఐదుగురు స్టార్​ క్రికెటర్ల వారసుల గురించి తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. ఇంగ్లాండ్ విజయం

చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్​ భారీ విజయం సాధించింది. టీమ్​ఇండియాను రెండో ఇన్నింగ్స్​లో 192 పరుగులకు ఆలౌట్​ చేసి 227 పరగుల తేడాతో గెలుపొందింది. జాక్​ లీచ్​​, అండర్సన్​లు తమ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. రాజీవ్ కపూర్ కన్నుమూత

రిషి కపూర్ సోదరుడు, బాలీవుడ్ సీనియర్ నటుడు రాజీవ్ కపూర్ (58) కన్నుమూశారు. ఈ విషయాన్ని రిషి కపూర్ భార్య నీతూ కపూర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details