1. సర్కారు బడికి పట్టం
విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సిరిసిల్లలో ఆధునీకరించిన జిల్లా పరిషత్ పాఠశాలను ప్రారంభించారు. సీఎస్ఆర్ రూపేణా నిధులు ఇచ్చి పాఠశాల అభివృద్ధికి సాయ పడిన సంస్థకు అభినందనలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. సీనియర్ సిటిజన్లకు విముక్తి
సీనియర్ సిటిజన్లకు ఐటీ రిటర్నుల నుంచి విముక్తి కల్పించింది కేంద్రం. 75 ఏళ్లు పైబడిన వారిని రిటర్నుల దాఖలు నుంచి మినహాయిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు, డిజిటల్ మాధ్యమం ద్వారా కార్యకలాపాలు సాగించే రూ. 10 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న కంపెనీలకు పన్ను ఆడిట్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. సామాన్యుడికి శక్తి
విద్యుత్, ఇంధన రంగంలో సామాన్యులకు మరింత సౌలభ్యం కల్పించే నిర్ణయాలను ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. విద్యుత్తు పంపిణీ వ్యవస్థలో పోర్టబులిటీ విధానం తీసుకొస్తున్నట్లు చెప్పారు. పట్టణ గ్యాస్ పంపిణీ వ్యవస్థను మరో 100 జిల్లాలకు పెంచుతున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. బడ్జెట్లో బడులకు కళ
ఉన్నత విద్యా కమిషన్ను ఏర్పాటు చేసేందుకు ఈ ఏడాది చట్టాన్ని తీసుకురానున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అదే సమయంలో నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా 15వేల పాఠశాలలను శక్తివంతంగా తీర్చిదిద్దనున్నట్టు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. అవి చిన్న కంపెనీలే
చిన్న కంపెనీలకు ఊరటనిచ్చేలా బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటనల చేశారు. రూ.2 కోట్లకు క్యాపిటల్ ఉన్న సంస్థలను సైతం చిన్న కంపెనీలుగా పరిగణించనున్నట్లు తెలిపారు. బ్యాంకులకు ఈ సారి బడ్జెట్లో రూ.20 వేల కోట్ల మూలధన సాయాన్ని ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.