1. భరోసా కావాలి
శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదానికి కారణమైన బాధ్యులపై... కఠిన చర్యలు తీసుకోవాలని జెన్‌కో ఉద్యోగులు డిమాండ్ చేశారు. అమరులైన ఉద్యోగుల కుటుంబాలకు సరైన న్యాయం చేయడంతోపాటు.. ఇప్పుడున్న ఉద్యోగులకు భద్రతపై భరోసా కల్పించాలన్నారు. ప్లాంటు పునరుద్ధరణకు కలిసికట్టుగా శ్రమిస్తామని పునరుద్ఘాటించారు. విద్యుత్ ఉద్యోగుల ఐకాస అధ్వర్యంలో జరిగిన అమరుల సంతాపసభలో వారు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మరోవైపు ప్లాంట్‌ను సందర్శించిన జెన్‌కో అంతర్గత కమిటీ... ప్రమాద తీరుపై ఆరా తీసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. డ్రాగన్ పశ్చాత్తాపం
గల్వాన్ దుశ్చర్య జరిగిన రెండు నెలల తర్వాత ఆ ఘటనపై పశ్చాత్తాప వ్యాఖ్యలు చేసింది చైనా. ఆనాటి ఘర్షణను దురదృష్టకర సంఘటనగా అభివర్ణించింది. ఇలాంటి ఘటనలను ఇరు దేశాలూ కోరుకోవడం లేదని భారత్‌లోని చైనా రాయబారి సన్వీడాంగ్ అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. అఫ్గాన్‌లో శిక్షణ
పుల్వామా ఘటనకు సంబంధించి పాకిస్థాన్‌లో జరిగిన కుట్రనంతా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అభియోగ పత్రంలో వివరించింది. 2016-17లో జైషే మహమ్మద్‌కు వచ్చిన కారు బాంబు దాడి ఆలోచనతో.. అదును చూసి భారత్‌లోకి అడుగుపెట్టారు ఉగ్రవాదులు. ఈ బృందం భారత్ వచ్చాక జైషే మహమ్మద్ అగ్రనాయకత్వం ప్రత్యేకంగా వీరితో 'టచ్'లో ఉంది. ఆపరేషన్ ఆద్యంతం వారి కనుసన్నల్లోనే జరిగిందని.. ఆ వివరాలన్నింటినీ ఛార్జిషీట్లో పేర్కొంది ఎన్ఐఏ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. కోమాలోనే ప్రణబ్
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యంపై బులెటిన్ విడుదల చేశారు ఆర్మీ ఆస్పత్రి వైద్యులు. ప్రస్తుతం వెంటిలేటర్‌పైనే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్కు సంబంధించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. స్పీకర్ అసంతృప్తి
పార్లమెంటరీ కమిటీల భేటీల్లోని సమాచారం బయటకు రావటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా. పార్లమెంటులో నివేదిక సమర్పించక ముందు ఏ సమాచారం లీక్ కాకుండా జాగ్రత్తపడాలని కోరుతూ.. కమిటీల ఛైర్మన్లకు లేఖ రాశారు. ఫేస్బుక్ వివాదంపై భాజపా నేతల ఫిర్యాదు మేరకు స్పందించారు స్పీకర్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.