1. సరికొత్తగా..
కొత్త సంవత్సరంలో దేశం సమున్నత శిఖరాలను అధిరోహిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభ పరిస్థితులు అనేక పాఠాలు నేర్పించాయన్నారు. ఆర్థిక వేత్తలు కూడా అంచనా వేయలేని పరిస్థితులు తలెత్తాయని చెప్పారు. అయితే ఈ కాలంలో భారత్ మరిన్ని సామర్థ్యాలు పెంచుకుందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ఉద్రిక్తత..
నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని కిష్టరాయినిపల్లి ప్రాజెక్టు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పునరావాస పరిహారం ఇచ్చేవరకు పనులు చేపట్టవద్దని లక్ష్మణాపురం గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. పెట్రోల్ సీసాలతో నిరసన తెలిపారు. ప్రాజెక్టు పనులను అడ్డుకునేందుకు గ్రామస్థులు యత్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. గుల్లక్ బ్యాంకు
పిల్లలకు ఆర్థిక క్రమశిక్షణ, పొదుపు.. అలవాటు చేయాలనే లక్ష్యంతో బిహార్లో ఏర్పాటు చేసిన బాలల బ్యాంక్.. గుల్లక్. దీన్ని 2009లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. అయితే ఇందులో ఖాతాదారులుగానే కాకుండా బ్యాంకు నిర్వహణ బాధ్యత కూడా చిన్నారులే చేపట్టడం విశేషం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. అసోంలో షా..
అసోం పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఆదివారం గువాహటిలోని ప్రఖ్యాత కామాఖ్యా దేవి ఆలయాన్ని సందర్శించారు. ఆయనతో పాటు రాష్ట్ర సీఎం, ఆరోగ్యమంత్రి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ఐహెచ్సీ వాయిదా..
కరోనా మహమ్మారి వల్ల ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ 81వ సమావేశం నిరవధికంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో కీలక సమస్యలు, అంశాలపై ఆన్లైన్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఐహెచ్సీ తెలిపింది. పంజాబ్ రైతుల నిరసనలు, భారతీయ నాగరితక వంటి విషయాలపై డిసెంబర్ 28 నుంచి 30 మధ్య వెబినార్లు జరగనున్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.