1. 'ఛలో దిల్లీ'లో ఉద్రిక్తత
సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేపట్టిన ఛలో దిల్లీ కార్యక్రమం మరోసారి ఉద్రిక్తతలకు దారి తీసింది. దిల్లీ వైపు వెళుతున్న రైతులను పోలీసులు అడ్డుకోవడం వల్ల ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. పౌరుల భవిష్యత్తే ముఖ్యం..
తెరాస ప్రభుత్వం హైదరాబాద్ నగర పౌరుల ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హరితహారం స్ఫూర్తితో నగరంలో పచ్చదనం పెంపుదలకు కృషి చేశామని ట్విట్టర్ వేదికగా తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. రాష్ట్రంలో కరోనా..
రాష్ట్రంలో కొత్తగా నమోదైన 761కేసులతో కలిపి... బాధితుల సంఖ్య 2,67,665కు చేరింది. మరో నలుగురు మృతి చెందగా... ఇప్పటి వరకు వైరస్ 1,448 మంది చనిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా 10,839 మంది చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. 150 పోలింగ్ కేంద్రాలు..
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియ పూర్తి సాఫీగా, పారదర్శకంగా జరిగేలా ఎస్ఈసీ చర్యలు తీసుకుంటోంది. వెబ్ కాస్టింగ్, సీసీకెమెరాల ఏర్పాటు సహా మైక్రో అబ్జర్వర్ల సేవలు వినియోగించుకోనున్నారు. ఓటరు గుర్తింపు కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. డివిజన్‌కు ఒక పోలింగ్ కేంద్రం చొప్పున ఫేసియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీని ఉపయోగించేందుకు రంగం సిద్ధమవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 'దిశ'కు ఏడాది
దిశ హత్యాచార ఘటనకు నేటితో ఏడాది పూర్తైంది. శంషాబాద్ సమీపంలో జాతీయ రహదారి పక్కనే దిశను నలుగురు యువకులు అమానుషంగా అత్యాచారం చేసి... ఆ తర్వాత చటాన్‌పల్లి వద్ద వంతెన కింద కాల్చేశారు. పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ తర్వాత ఘటనా స్థలంలో నుంచి వివరాలు సేకరిస్తుండగా... పోలీసులపై ఎదురు తిరిగారు. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో నిందితులు చనిపోయారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ రెండు ఘటనపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక న్యాయ కమిషన్ ప్రస్తుతం విచారణ జరుపుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.