1. భేటీ ప్రారంభం..
కేంద్ర మంత్రి గజావత్ సింగ్ నేతృత్వంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. హైదరాబాద్ నుంచి కేసీఆర్, దిల్లీ నుంచి జగన్... వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ప్రవేశాలకు ఆహ్వానం..
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కమ్యూనిటీ సైన్స్ కోర్సుల ప్రవేశ ప్రకటన విడుదలైంది. మొత్తం 60 సీట్ల భర్తీకి గత నెలలో ప్రవేశ ప్రకటన విడుదల చేసిన వర్సిటీ.. తదుపరి చర్యలకు ఉపక్రమించింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 10 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్ కుమార్ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ముగిసిన భేటీ..
ప్రధాని మోదీతో.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర సమస్యలపై ప్రధానితో చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రధానికి సీఎం వివరించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. వాయిదా..
ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేయాలన్న పిటిషన్‌పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది సుప్రీం కోర్టు. ఇందుకోసం కొన్ని రాష్ట్రాల హైకోర్టులు ఇచ్చిన నివేదికలో వివరాలు సమగ్రంగా లేవని సుప్రీం వ్యాఖ్యానించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. మొక్క నాటిన కౌర్..
రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అందరిలో స్ఫూర్తిని కలిగిస్తున్నది. మంగళవారం తన నివాసంలో అమరావతి (మహారాష్ట్ర) ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్ మొక్కలను నాటారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. దిలిప్ రే దోషి..
బొగ్గు బ్లాక్‌ను కేటాయించడంలో జరిగిన అవకతవకలకు సంబంధించిన కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రే దోషిగా తేలారు. ఆయనతో పాటు బొగ్గు శాఖలో పనిచేసిన అధికారులను ఝార్ఖండ్‌లోని ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా తేల్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. గాలి ద్వారానూ కరోనా..
కరోనా మహమ్మారి గాలి ద్వారా వ్యాపిస్తుందా?లేదా? అనే ప్రశ్నకు ఇప్పటివరకు కచ్చితమైన సమాధానం లేదు. కానీ, గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందగలదని స్పష్టం చేసింది అమెరికాకు చెందిన సీడీసీ. అయితే, వైరస్ గాలిలో ఎంతసేపు బతికుంటుంది..? గాలి ద్వారా సోకే మహమ్మారిని అరికట్టడం ఎలా..? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. జైశంకర్-పాంపియో
అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియోతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం నెలకొనేందుకు అమెరికా-భారత్ కలిసి పనిచేస్తాయని జైశంకర్ తెలిపారు. భారత్ పరిసరాల్లో భద్రతా పరిస్థితులపైనా ఇరువురు చర్చించినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. శభాష్ శ్రేయస్..
దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో దిల్లీ సారథి శ్రేయస్ అయ్యర్ తన వ్యూహాలతో మెప్పించాడని అన్నాడు టీమ్ఇండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. 'చందమామ' పెళ్లి..
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. గౌతమ్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోనున్నట్లు వెల్లడించింది. అక్టోబరు 30న ముంబయిలోని ఓ చిన్న హోటల్లో వీరి వివాహ వేడుక జరగనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.