1. ఎంతోమందికి నీడ..
జీహెచ్ఎంసీ పరిధిలోని రెవెన్యూ సమస్యలపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాప్రతినిధులు, కాలనీ సంఘాల ప్రతినిధులు సమీక్షలో పాల్గొన్నారు. హైదరాబాద్ గత ఆరేళ్లల్లో దేశంలోని లక్షలాది మందికి గమ్యస్థానంగా మారిందని కేటీఆర్ అన్నారు. పెట్టుబడులు, పరిపాలనా సంస్కరణలు, రాజకీయ స్థిరత్వమే అభివృద్ధికి కారణమని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. మన్మోహన్లా ఉండాలి
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. మన్మోహన్‌ను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీపై పరోక్ష విమర్శలు చేశారు రాహుల్. మన్మోహన్ లాంటి లోతైన ఆలోచన కలిగిన ప్రధాని ప్రస్తుతం లేరని దేశం భావిస్తోందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. మూడు రోజులు రైల్‌రోకో..
రాజ్యసభలో ఇటీవల ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ పంజాబ్ వ్యాప్తంగా చేస్తున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ఇప్పటికే మూడురోజుల 'రైల్ రోకో' చేపట్టిన రైతు సంఘాలు.. దాన్ని ఈ నెల 29వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. జిమెక్స్-20
ఉత్తర అరేబియా సముద్ర ప్రాంతంలో భారత్, జపాన్ నౌకాదళ విన్యాసాలు జిమెక్స్-20 ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఇరు దేశాలకు చెందిన కీలక యుద్ధ నౌకలు వివిధ ప్రదర్శనలు చేయనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. చైనాకు వార్నింగ్..
సరిహద్దుల్లో దురాక్రమణకు పాల్పడితే తమ బలగాలు కాల్పులకూ వెనుకాడబోవని చైనాకు తేల్చి చెప్పింది భారత్. వాస్తవాధీన రేఖ వెంబడి తోపులాటలు, కర్రలు, రాళ్లతో ఘర్షణలు ఇకపై ఉండబోవని స్పష్టం చేసింది. అంతేకాకుండా సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ కూడా చైనా వైపు నుంచే ప్రారంభం కావాలని భారత్ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.