1. మంత్రుల భేటీ
ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్ పాలసీలపై మంత్రులు సమావేశమయ్యారు. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీపై అన్ని శాఖల మంత్రులు, అధికారులతో సమావేశమై చర్చించాలని ఇటీవల మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. అందుకు అనుగుణంగా మంత్రివర్గ సహచరులతో పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. బాధ్యతగా ఉండాలి
సామాజిక మాధ్యమ వినియోగదారులు బాధ్యాతాయుతంగా వ్యవహరించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఒక బాధ్యతారాహిత్య పోస్టు ఎంతటి అనర్థానికి దారి తీస్తుందో... బెంగళూరు ఘటనను ట్విట్టర్ వేదికగా ఉదహరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. తిప్పుకోవద్దు
స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలు చట్టపరంగా పరిష్కరించాలని పోలీసులను... డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. తొలిసారి వచ్చినప్పుడే సమస్య పరిష్కరించి మరోసారి స్టేషన్‌కు రాకుండా చూసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. మోదీకే సాధ్యం
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మరోమారు విమర్శలు చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జీడీపీ వృద్ధి అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోతుందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'మోదీ ఉంటే అన్ని సాధ్యమే'నంటూ భాజపా ఎన్నికల నినాదాన్ని గుర్తు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ఆ యాడాది నరకం
ఈ ఏడాది కరోనా మహమ్మారి రాకతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి కంటే భయానక స్థితిని 14 శతాబ్దంలోని ప్రజలు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రపంచానికి వెలుగునిచ్చే ఆ సూర్యుడు కొన్ని రోజుల పాటు కనిపించలేదంటే నమ్మగలరా? మరీ ఆ భానుడు కనిపించకపోవటానికి గల కారణాలు ఏమిటీ? ఇంతకీ ఆ దేశ ప్రజలు ఎవరో తెలుసుకుందామా? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.