తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్ @1pm - latest news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @1pm
టాప్‌టెన్‌ న్యూస్ @1pm

By

Published : Jul 29, 2020, 1:02 PM IST

1. మరింత బలోపేతం

మరికొన్ని గంటల్లో రఫేల్​ యుద్ధ విమానాలు భారత్​లోకి ప్రవేశపెట్టనున్నాయి. ఈ నేపథ్యంలో అంబాలలో హరియాణా ప్రభుత్వం 144 సెక్షన్​ విధించింది. ఫ్రాన్స్​ నుంచి రఫేల్​ ప్రయాణం ఎలా సాగింది? అసలు భారత దేశానికి రఫేల్​ ఎందుకింత ప్రత్యేకం? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. దశలవారీగా లింక్‌ రోడ్లు

హైదరాబాద్​లో దశల వారీగా 137 లింక్‌ రోడ్ల నిర్మాణం చేస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. సనత్​నగర్​లో రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమలో పశుసంవర్ధ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. మరో ఎమ్మెల్యేకు

నిజామాబాద్​ జిల్లాలో మరో ఎమ్మెల్యేకు కరోనా సోకింది. ఆర్మూర్​ ఎమ్మెల్యే జీవన్​రెడ్డికి కరోనా పాజిటివ్​గా వైద్యులు నిర్ధరణ చేశారు. దీంతో ఎమ్మెల్యే హోమ్​ ఐసోలేషన్​లో ఉన్నారు. ఆయన కుటుంబసభ్యులకు సైతం అధికారులు కొవిడ్​ పరీక్షలు నిర్వహించారు. గతంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బాజిరెడ్డి గోవర్దన్, గణేశ్ గుప్తా వైరస్ బారిన పడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. సారస్వత సదనానికి శంకుస్థాపన

హైదరాబాద్​ బంజారాహిల్స్‌లో డా.సి.నారాయణరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. డా.సి.నారాయణరెడ్డి సారస్వత సదనం ఆడిటోరియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. ప్రోత్సహిస్తున్నాం

రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి కళలు, కళాకారులను ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో ప్రోత్సహిస్తోందని పర్యాటక సాంస్కృతిక, ఎక్సైజ్​ శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ అన్నారు. హైదరాబాద్​ బంజారాహిల్స్‌లో డా.సి.నారాయణరెడ్డి జయంతి వేడుకల్లో కేటీఆర్​తో కలిసి పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. భారీ వర్షాలు

ఉత్తరాఖండ్​లో​ ప్రకృతి విలయం కొనసాగుతోంది. భారీ వర్షాల వల్ల చమోలీ జిల్లా కొడియాలోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రహదారిపై మట్టి పేరుకుపోయి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల వాహనాలు నిలిచిపోయాయి. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శిథిలాలను తొలగించేందుకు విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. ఉపాధ్యాయులూ యోధులే..

కరోనా ప్రభావం విద్యావ్యవస్థపైనే అధికంగా పడింది. ఉపాధ్యాయులు తీవ్రంగా ప్రభావితమయ్యారు. కోట్లాది మంది విద్యార్థుల చదువులు కొనసాగేలా చూసే బాధ్యత వారిపై ఉంది. అయితే 91 లక్షల మంది ఉపాధ్యాయులు సుశిక్షితులు కాకపోవడం వల్ల ఉద్యోగపరంగా అస్థిరతను ఎదుర్కొంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. అలా గర్భం దాల్చాలట..

ఆస్ట్రేలియాకు చెందిన "ప్రపంచంలోనే అత్యంత సమరూప కవలలు" తమ వింత కోరికను బయటపెట్టారు. అన్ని పనులు కలిసి చేసే వీరు.. ఇప్పుడు ఒకేసారు గర్భందాల్చి.. ఆ అనుభుతిని కూడా ఒకేసారి పొందాలనుకుంటున్నారు. తమ బాయ్​ఫ్రెండ్​ను ప్రస్తావిస్తూ ఈ కోరికను వెల్లడించారు. వీరి సంభాషణ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. హైడ్రోక్లోరోక్వినైన్ బెటర్

కొవిడ్ నియంత్రణకు హైడ్రాక్సీక్లోరోక్విన్ బాగా పనిచేస్తుందని తను చేసిన వ్యాఖ్యలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ సమర్థించుకున్నారు. చాలా మంది వైద్యులు కూడా తన వ్యాఖ్యలను సమర్థిస్తున్నారని పేర్కొన్నారు. కొవిడ్ చికిత్సకు మలేరియా ఔషధం వాడడం వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుందని శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నా... ట్రంప్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. నటులపై కేసు

ఇద్దరు ప్రముఖ తమిళ నటులపై కేసు నమోదు చేశారు కొడైక్కెనాల్​కు చెందిన పోలీసులు. ఈ-పాస్​ లేకుండా పర్యటక ప్రాంతాన్ని సందర్శించినట్లు తెలిపారు. అంతేకాకుండా కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు చెరో రూ.2000 జరిమానా వేసినట్లు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details