1. మరో పరువు హత్య
రాష్ట్రంలో పరువు హత్యలు ఆగడం లేదు. తాజాగా కుమార్తె ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిని అపహరించి హత్య చేయించాడు ఓ తండ్రి. హైదరాబాద్ చందానగర్‌లో నివాసం ఉంటున్న హేమంత్ ఇటీవల ప్రేమ విహహం చేసుకున్నాడు. గచ్చిబౌలిలోని టీఎన్‌జీవో కాలనీలో నివాసం ఉంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. రోడ్డెక్కిన సిటీ బస్సులు
ఆరు నెలల తర్వాత సిటీ బస్సులు రోడ్డెక్కాయి. కొవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని బస్సలను బయటకు పంపుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 25 శాతం బస్సులు నడపనున్నట్టు మంత్రి అజయ్ కుమార్ తెలిపారు. నేటి నుంచి కర్ణాటక, మహారాష్ట్రకు కూడా సర్వీసులు పునఃప్రారంభిచనున్నట్టు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. కొత్త కేసులు..
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కరోనా బాధితుల సంఖ్య 1,81,627కు చేరింది. కొత్తగా 2,381 కరోనా కేసులు, 10 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా మహమ్మారి బారిన పడి 1,080 మంది మృతి చెందారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 386 కరోనా కేసులు నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. దేశంలో 58 లక్షలు..
దేశంలో కరోనా కేసుల సంఖ్య 58 లక్షలు దాటింది. కొత్తగా 86,052 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 1141మంది వైరస్‌కు బలయ్యారు. ఒక్కరోజు వ్యవధిలో 81వేల మందికిపైగా వైరస్ బారి నుంచి కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. బిహార్ నగారా..
బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌పై శుక్రవారం స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 12.30కి కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.