1. రాష్ట్రంలో కరోనా..
రాష్ట్రంలో కొత్తగా 1302 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,72,608కి చేరింది. కొవిడ్‌తో కొత్తగా 9 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 1042కు పెరిగింది. 2,230 మంది వైరస్ నుంచి బయటపడగా.. ఇప్పటి వరకు మొత్తం 1,41,930 మంది బాధితులు కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. సభ నుంచి సస్పెండ్
రాజ్యసభలో కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు సభలో చేసిన ఆందోళనపై ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సభలో అనుచితంగా ప్రవర్తించిన 8 మందిని సభ ముగిసే వరకూ సస్పెండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. మహా విజృంభణ..
దేశంలో కరోనా వ్యాప్తి ఉగ్రరూపం దాల్చుతుంది. కొత్తగా 86,961 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 1,130 మంది కొవిడ్‌కు బలయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. హస్తం దూకుడు..
తెలంగాణలో రాబోయే నగరపాలక, దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ దూకుడు పెంచుతోంది. పార్టీని బలోపేతం చేసే దిశలో అధిష్ఠానం పావులు కదుపుతోంది. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా నియమితులైన మానిక్కం ఠాకూర్ జూమ్ యాప్ ద్వారా తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో వరుసగా సమావేశమవుతూ దిశానిర్దేశం చేస్తున్నారు. తెరాస ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి... ఓటర్లలో చైతన్యం తీసుకొస్తే... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారమని స్పష్టం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. మహిళ అరెస్టు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై విష ప్రయోగం కేసులో ఓ మహిళను అరెస్టు చేశారు పోలీసులు. పార్శిల్ కెనడా నుంచి వచ్చినట్లు గుర్తించిన పోలీసులు... దాని ఆధారంగా విచారణ జరిపి, ఓ మహిళే నిందితురాలని తెలుసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.