1. మరో 1,897 కేసులు
రాష్ట్రంలో కొత్తగా 1,897 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 84,544కు చేరుకుంది. మరో 9 మంది మరణించగా... మృతుల సంఖ్య 654కు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. కరోనా పంజా
దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఒక్కరోజే 60,963 కేసులు నమోదయ్యాయి. మరో 834 మందిని మహమ్మారి బలి తీసుకుంది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 23 లక్షలు దాటింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. మరో మందు
కొవిడ్ నివారణకు ఇప్పటికే పలు వ్యాక్సిన్ల ట్రయల్స్ జరుగుతున్నాయి. తాజాగా 'నిక్లోసమైడ్' అనే కొత్త ఫార్ములేషన్‌పై మ్యాన్‌కైండ్ ఫార్మా ప్రయోగాలు చేపట్టింది. ఈ మేరకు దక్షిణ కొరియా కంపెనీ అయిన దేవూంగ్ ఫార్మాసూటికల్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. బస్సులో మంటలు
కర్ణాటక చిత్రదుర్గలో విషాదం జరిగింది. విజయాపుర్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి అక్కడికక్కడే ఐదుగురు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ఉగ్రవాది హతం
జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లా కమ్రాజిపొరా వద్ద ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ముష్కరుడు హతమయ్యాడు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, గ్రనేడ్లు, ఇతర మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ముష్కర వేట కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.