1. కొత్త కేసులు 1,256
తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఆదివారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,256 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. స్వదేశీ వ్యాక్సిన్
కొవిడ్ వ్యాక్సిన్‌పై చెన్నై ఇంటర్నేషనల్ సెంటర్ సభ్యులతో జరిగిన చర్చాగోష్ఠిలో భారత్ బయోటెక్ ఛైర్మన్, మేనేజింగ్ కృష్ణ ఎల్ల పాల్గొన్నారు. అత్యుత్తమ నాణ్యతతోనే కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. సామర్థ్యానికి మించి..
ఉస్మానియా ఆసుపత్రి శవాగారానికి ఇటీవలి కాలంలో మృతదేహాల తాకిడి అధికమైంది. సామర్థ్యానికి మించి మృతదేహాలు తీసుకువస్తుండటంతో స్థలం సరిపోక ఇబ్బందులు తప్పడం లేదు. గత్యంతరం లేని స్థితిలో శవాల గదిలోని స్ట్రెచర్లపైనే సిబ్బంది వాటిని భద్రపరుస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. సబ్‌మెరైన్ ప్రారంభం
అండమాన్‌కు మెరుగైన సమాచారం అందించే విధంగా ఏర్పాటు చేసిన సబ్‌మెరైన్ కేబుల్ వ్యవస్థను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్ సహా మరో ఏడు ద్వీపాలకు సముద్రగర్భంలో సబ్‌మెరైన్ కేబుళ్లను ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ఎంత పలికిందంటే..?
గాంధీ అనగానే గుండ్రటి అద్దాలు.. బంగారు పూత పూసిన కళ్లజోడుతో బోసినవ్వులు చిందిస్తున్న ఆయన ముఖమే కళ్లముందు కదలాడుతుంది. అవి లేని గాంధీ చిత్రపటం కనపడటం చాలా అరుదు. ఆ స్థాయిలో ప్రసిద్ధికెక్కాయి ఆ అద్దాలు. మరి, ఆయన ధరించిన ఆ అద్దాలను వేలం వేస్తే..? అవును, ఆనాటి గాంధీ కళ్లజోడును ఇప్పడు బ్రిటన్.. అంతర్జాతీయ వేలంపాటలో పెట్టింది. మరి, స్పందన ఎలా ఉందో తెలుసా? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.