1. మరో 1,764
రాష్ట్రంలో కొత్తగా 1,764 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 58,906కు చేరుకుంది. మరో 12 మంది మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 492కు చేరింది. మొత్తం 14,663 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. కొవిడ్ విలయం
దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 47,744 వైరస్ పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. 768 మంది వైరస్ ధాటికి బలయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. అంబాలా సిద్ధం
భారత రక్షణ రంగాన్ని శత్రు దుర్భేద్యం చేసే రఫేల్ యుద్ధవిమానాలు ఇవాళ మధ్యాహ్నం అంబాలా వైమానిక స్థావరానికి చేరుకోనున్నాయి. ఫ్రాన్స్‌లోని అల్-దాఫ్రా వైమానిక స్థావరం నుంచి ఇప్పటికే ఈ యుద్ధ విమానాలు భారత్‌కు పయనమయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. రైల్వే రికార్డు
కరోనా సమయంలోనూ భారతీయ రైల్వే గణనీయమైన మైలురాయిని సాధించింది. గతేడాదికి మించి సరకు రవాణా చేసింది. జులై 27న సరకు రవాణా 3.13 మెట్రిక్ టన్నులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. లాక్‌డౌన్ కాలంలో రైల్వే దాదాపు 200 మౌలిక సదుపాయాల పనులను పూర్తి చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. భవనం నేలమట్టం
కర్ణాటక రాజధాని బెంగళూరులో నాలుగు అంతస్తుల భవనం మంగళవారం అర్థరాత్రి ఒక్కసారిగా కూలిపోయింది. మల్టీప్లెక్స్ నిర్మించడానికి ప్రస్తుతం ఉన్న కపాలి థియేటర్‌ను కూల్చివేశారు. ప్రస్తుతం పార్కింగ్ స్థలం నిర్మించడానికి పనులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. దీని కోసం 50 అడుగుల లోతులో గొయ్యి తీసి, కొత్త నిర్మాణం చేపట్టారు. ఈ క్రమంలోనే దాని వెనుక ఉన్న నాలుగు అంతస్తుల భవనం బీటలువారి ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. అయితే ఈ ఘటనలో ఎవరు మరణించలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.