1. గోస తీర్చేందుకు..
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్లోని నీటితో... వేసవిలో రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువులను నింపేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. దశాబ్దాల తరబడిగా రైతన్న అనుభవించిన గోసకు కాళేశ్వరం పరిష్కారం చూపిందన్న సీఎం... ఈ తరహాలోనే ఇతర భారీ ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ఉదయం నుంచి కాళేశ్వరంలో పర్యటించిన కేసీఆర్ దంపతులు... ముక్తీశ్వరునికి, గోదారమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
2. తల్లిదండ్రులదే నిర్ణయం..
పాఠశాలలు, కళాశాలల విద్యా సంవత్సరాన్ని త్వరలో ప్రకటించనున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. వివిధ తరగతుల్లో సిలబస్ తగ్గింపుపై... త్వరలో స్పష్టత ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. తల్లిదండ్రుల పూర్తి నిర్ణయంమేరకే.. తమ పిల్లలను పాఠశాలలకు పంపించాలని.. సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయడం.
3. సజావుగా వ్యాక్సినేషన్
రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మూడో రోజు సజావుగా సాగింది. కొవిన్ సాఫ్ట్‌వేర్ స్వల్ప సమస్యలు తలెత్తుతున్నా... ముందుగా చేసుకున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ముందుకెళ్తున్నామని అధికారులు తెలిపారు. రాష్ట్రానికి ఇవాళ మరో మూడున్నర లక్షల డోసులు వచ్చాయని వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయడం.
4. మెడలు వంచుతాం..
తెరాస ప్రభుత్వం మెడలు వంచి.. ప్రతీ గింజ కొనుగోలు చేసేలా చూస్తామని ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయడం.
5. నడ్డాxరాహుల్
చైనా, సాగు చట్టాలు, కొవిడ్-19 వంటి అంశాలను చూపుతూ కేంద్రంపై విమర్శలు చేస్తోన్న రాహుల్ గాంధీపై ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఆ వెనువెంటనే నడ్డా ఆరోపణలను తిప్పుకొడుతూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు రాహుల్. ఈ క్రమంలో ఇరువురి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయడం.
6. మావోల కంటే డేంజర్..!
భాజపాపై బంగాల్ సీఎం మమతా బెనర్టీ తీవ్ర విమర్శలు చేశారు. మావోయిస్టుల కంటే భాజపా ప్రమాదకరమైన పార్టీ అని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయడం.
7. కరోనా పట్ల అలసత్వం