1. కేసీఆర్ సమీక్ష
శాసనమండలి, శాసనసభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో... సమావేశాల నిర్వహణ, అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యమంత్రి కేసీఆర్... మంత్రులతో భేటీ అయ్యారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ఏపీ సర్కారుకు మరోసారి చుక్కెదురు
ఏపీ సర్కార్‌కు సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆంగ్లమాధ్యమం విషయంలో హైకోర్టు ఆదేశాలపై స్టే కోరుతూ ఏపీ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3.రాజాసింగ్ వ్యక్తిగత ఖాతాలను తొలగించిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్
భాజపా నేత రాజాసింగ్ వ్యక్తిగత ఖాతాలను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తొలగించింది. విద్వేషపూరిత పోస్టులు పెట్టడంపై ఖాతాను నిషేంధిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4.గోదావరి తీరంలో యథేచ్చగా ఇసుక అక్రమ రవాణా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు గోదావరి పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్చగా సాగుతోంది. కొందరు పెద్దల అండదండలతో ఇసుక రవాణా మణుగూరు నుంచి హైదరాబాద్ వైపు పరుగులు తీస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5.కంటెయిన్మెంట్ జోన్లలో పరీక్ష కేంద్రాలొద్దు
కరోనా వేళ దేశవ్యాప్తంగా విద్యాసంస్థలకు ఈ నెలాఖరులోపు తుది పరీక్షలు నిర్వహించేందుకు యూజీసీ గడువు విధించింది. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు సంబంధించి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. కంటెయిన్మెంట్ జోన్లలో పరీక్ష కేంద్రాలు పెట్టొద్దని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.