తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈటీవీ భారత్​ - ప్రధాన వార్తలు - ఈరోజు ప్రధాన వార్తలు

TOPNEWS@6AM
టాప్​న్యూస్​@6AM

By

Published : Oct 11, 2021, 5:59 AM IST

Updated : Oct 11, 2021, 9:58 PM IST

21:52 October 11

టాప్​ న్యూస్​ @10PM

  • వాటిని చూసి విస్తుపోయిన అధికారులు

హైదరాబాద్​లోని హెటిరో డ్రగ్స్(IT Raids on Hetero Drugs) కార్యాలయాలపై ఈనెల 6న ఐటీ అధికారులు చేసిన సోదాల్లో భారీ ఎత్తున నగదు, బంగారం దొరకడం సంచలనం సృష్టిస్తోంది. లాకర్లలో నగదు, బంగారం దాచిన విధానాన్ని చూసి ఐటీ అధికారులే విస్తుపోయారు. పెద్ద సంఖ్యలో లాకర్లు ఉన్నట్లు గుర్తించిన ఐటీ అధికారులు.. 16 మాత్రమే తెరచినట్లు ఐటీ అధికారులు అధికారికంగా వెల్లడించారు.

  • విష్ణు షాకింగ్​ కామెంట్స్​

'మా' ఎన్నికల తుది ఫలితాల తర్వాత విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి తనను పోటీ నుంచి తప్పుకోమని కోరినట్లు చెప్పారు.

  • టీకా వేసిన ఆశావర్కర్​పై దాడి

కరోనా టీకా వేసుకొంటే.. జ్వరం వచ్చిందని.. వ్యాక్సినేషన్​ (corona vaccination)చేసిన ఆశావర్కర్​పై దాడి చేశారు (attack on Asha worker). ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. దాటి ఘటనపై పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు నమోదైంది. కలెక్టరేట్​లోనూ బాధితులు ఫిర్యాదు చేశారు.

  • బాల్య వివాహాల వల్ల రోజుకు 60మంది బాలికలు బలి!

బాల్యవివాహాల కారణంగా రోజుకు ప్రపంచవ్యాప్తంగా 60మంది బాలికలు మరణిస్తున్నట్లు ఓ నివేదికలో తేలింది. దక్షిణ ఆసియా ప్రాంతంలో సగటున ఆరుగురు చిన్నారులు మరణించినట్టు వెల్లడైంది. ప్రపంచ బాలికల దినోత్సవం సందర్భంగా ఈ గణాంకాలను 'సేవ్​ ది చిల్డ్రన్​' విడుదల చేసింది.

  • తడబడిన ఆర్సీబీ బ్యాట్స్​మెన్

ఐపీఎల్​లో ఎలిమినేటర్​ మ్యాచ్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు బ్యాట్స్​మన్​ తడబడ్డారు. కోల్​కతా నైట్​రైడర్స్​ బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులు నమోదు చేశారు.

20:51 October 11

టాప్​ న్యూస్​ @9PM

  • విద్యాశాఖ కీలక నిర్ణయం

కొవిడ్ పరిస్థితుల వల్ల విద్యా సంవత్సరం గందరగోళంగా మారినందున.. పదో తరగతిలో ఈ ఏడాది ఆరు పరీక్షలే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పదకొండు పరీక్షలకు బదులుగా ఆరు పరీక్షలే నిర్వహించడంతో పాటు ప్రశ్నల్లో మరిన్ని ఛాయిస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. 

  • ఆ లెక్కల్లో తెరాస టాప్​ 

ఎలక్టోరల్​ బాండ్ల ద్వారా విరాళాలు పొందడంలో తెరాస​.. దేశంలోని 42 ప్రాంతీయ పార్టీల్లోనే అగ్రగామిగా నిలిచింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.130.46కోట్ల ఆదాయాన్ని విరాళాల రూపంలో అర్జించింది. మూడో స్థానంలో వైకాపా ఉంది. మొత్తం 42 పార్టీలపై ఏడీఆర్​ నివేదిక రూపొందించగా.. 14 మాత్రమే విరాళాల వివరాలను బయటపెట్టాయి.

  • పోలీస్​ కస్టడీకి కేంద్ర మంత్రి కుమారుడు

కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్​ మిశ్రాకు (Ashish Mishra Lakhimpur) న్యాయస్థానం మూడు రోజుల పోలీస్​ రిమాండ్​ను విధించింది. ఈనెల 3న జరిగిన లఖింపుర్​ ఖేరి ఘర్షణల్లో మిశ్రా ప్రధాన నిందితుడు.

  • జమ్ముకశ్మీర్​ షోపియాన్​లో ఎన్​కౌంటర్​

జమ్ముకశ్మీర్​ షోపియాన్​ జిల్లాలో ఎన్​కౌంటర్​ సంభవించింది. ప్రస్తుతం ముష్కరులు, భద్రతాదళాల వలలో చిక్కారు.

  • యాంకర్ అనసూయకు షాక్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్​ ఎన్నికల్లో అనసూయకు చుక్కెదురైంది. ఆదివారం గెలిచిందని చెప్పగా, సోమవారం విడుదల చేసిన తుది ఫలితాల్లో మాత్రం ఆమె పేరు కనిపించలేదు.

19:42 October 11

టాప్​ న్యూస్​ @8PM

  • 'మా' ఎన్నికల తుది ఫలితాలు 

ఎంతో ఆసక్తి రేకెత్తించి, చర్చనీయాంశమైన 'మా' ఎన్నికల పూర్తి ఫలితాలను ఎన్నికల అధికారి సోమవారం వెల్లడించారు. ఈ పోటీలో విష్ణు ప్యానెల్​లో 10, ప్రకాశ్​రాజ్ ప్యానెల్​లోని 8 మంది ఈసీ సభ్యులు విజయం సాధించారు.

  • కేసీఆర్​ సంక్షేమ పాలనకు నిదర్శనం

కర్ణాటకలోని రాయచూర్‌ను తెలంగాణలో కలపాలని ఆ ప్రాంత భాజాపా ఎమ్మెల్యే కోరడం... ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పాలనకు నిదర్శనమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎమ్మెల్యే కోరికను అక్కడి ప్రజలు సైతం చప్పట్లతో స్వాగతించారని తెలిపారు.

  • ఐటీ ఆఫీసర్​లా వచ్చి రూ.40లక్షలు దోపిడీ

ఆదాయపు పన్నుశాఖ అధికారి వేషంలో వచ్చి.. ఓ వ్యాపారి నుంచి రూ.40 లక్షలు దోచుకెళ్లాడు ఓ దుండగుడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ బులంద్​షెహర్​లో జరిగింది. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు.

  • 'క్వార్టర్ అంటే 30ఎంఎల్​ సర్​..'

ఓ ఆన్​లైన్​ క్లాస్​లో టీచర్​- స్టూడెంట్​ మధ్య జరిగిన ఫన్నీ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఆ వీడియోకు లక్షల వ్యూస్​ వచ్చాయి. ట్విట్టర్​లో వీడియోపై మీమ్స్​ చక్కర్లు కొడుతున్నాయి. మరి ఆ ఫన్నీ సంభాషణను మీరూ చూసేయండి.

  • బెంగళూరు బ్యాటింగ్​

ఐపీఎల్​ 2021(IPL Eliminator 2021) ఎలిమినేటర్​ మ్యాచ్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు, కోల్​కతా నైట్​రైడర్స్​(RCB Vs KKR) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్​లో టాస్​ గెలిచిన బెంగళూరు టీమ్​ కెప్టెన్​ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

18:51 October 11

టాప్​ న్యూస్​ @7PM

  • రంగంలోకి షా

కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్​కే సింగ్, బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం(electricity shortage in india) నెలకొన్న క్రమంలో థర్మల్ కేంద్రాలకు బొగ్గు సరఫరా, ఇతర అంశాలపై చర్చించారు.

  • ఆదివాసి యువతిపై ఏడాదిగా అత్యాచారం

ఓ ఆదివాసి యువతిపై ఏడాదిగా అత్యాచారానికి పాల్పడ్డాడు పొరుగింటి వ్యక్తి. అంతేగాక ఆమె గర్భం దాల్చకుండా అబార్షన్ మాత్రలు ఇచ్చాడు. బాధితురాలు కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరితే అసలు విషయం బయటపడింది.

  • అక్కడ గ్యాస్​ సిలిండర్​ రూ. 2,657

తీవ్ర ఆహార, ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంది(sri lanka food emergency) శ్రీలంక. అక్కడ వంట గ్యాస్​ సిలిండర్​ ధర 90శాతం పెరిగింది(sri lanka food prices). ప్రస్తుతం అక్కడ సిలిండర్​ ధర రూ. 2,657. పాల ధరకు కూడా రెక్కలొచ్చాయి. ప్రస్తుతం కిలో పాల ధర రూ. 1,195గా ఉంది.

  • టాటాకు అప్పగించే ముందే ఎయిర్​ ఇండియా అప్పుల బదిలీ

ఎయిర్ ​ఇండియా అప్పులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సంస్థను టాటా గ్రూప్​కు అప్పగించే ముందే.. హామీ ప్రకారం డిసెంబర్​ నాటికి రుణాల బదిలీ ప్రక్రియను పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అప్పుల వివరాలు వెల్లడించింది ప్రభుత్వ ఆస్తులు, పెట్టుబడుల నిర్వహణ సంస్థ.

  • అన్నాత్తే టీజర్​ అప్పుడే.. 

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో అన్నాత్తే, శాకుంతలం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్, అనుభవించు రాజా, హమ్ దో హమారే దో, ద లేడీ కిల్లర్, చోర్ బజార్, తగ్గేదే లే, ఇటర్నల్స్ చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

18:07 October 11

టాప్​ న్యూస్​ @6PM

  • వాగులో గొర్రెలు

వాగు దాటుతుండగా వరద ఒక్కసారిగా పెరిగింది. ఒక గొర్రె బావిలో పడితే.. మిగతావీ పడతాయన్న మాదిరి మూగజీవాలన్నీ ఆ వాగులో పడిపోయాయి. వరద ఉద్ధృతికి గొర్రెలు కొట్టుకుపోయాయి.

  • సీఎం విహంగవీక్షణం

సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్‌ను సీఎం కేసీఆర్‌ విహంగ వీక్షణం (CM inspected Mallanna sagar) చేశారు. హెలికాప్టర్‌ నుంచి మల్లన్నసాగర్‌ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. హెలికాప్టర్​లో ఇతర ముఖ్య అధికారులు ఉన్నారు.

  • పోలీస్​ కస్టడీకి కేంద్ర మంత్రి కుమారుడు

కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్​ మిశ్రాకు (Ashish Mishra Lakhimpur) న్యాయస్థానం మూడు రోజుల పోలీస్​ రిమాండ్​ను విధించింది. ఈనెల 3న జరిగిన లఖింపుర్​ ఖేరి ఘర్షణల్లో మిశ్రా ప్రధాన నిందితుడు.

  • కాంగ్రెస్​ మౌనదీక్ష

లఖింపుర్(Lakhimpur Kheri News)​ ఘటనకు కారణమైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను(Ajay Mishra News).. మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మౌనదీక్ష చేపట్టింది. లఖ్​నవూలోని గాంధీ విగ్రహం దగ్గర చేపట్టిన దీక్షలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా(Priyanka Gandhi Vadra News) పాల్గొన్నారు.

  • ప్రముఖ నటుడు వేణు మృతి

అనార్యోగ సమస్యలతో ప్రముఖ నటుడు వేణు(nedumudi venu died) తుదిశ్వాస విడిచారు. దీంతో మలయాళ చిత్రసీమకు చెందిన పలువురు స్టార్స్ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

16:47 October 11

టాప్​ న్యూస్​ @5PM

  • ఆ లెక్కల్లో దేశంలోనే తెరాస​ టాప్

ఎలక్టోరల్​ బాండ్ల ద్వారా విరాళాలు పొందడంలో తెరాస​.. దేశంలోని 42 ప్రాంతీయ పార్టీల్లోనే అగ్రగామిగా నిలిచింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.130.46కోట్ల ఆదాయాన్ని విరాళాల రూపంలో అర్జించింది. మూడో స్థానంలో వైకాపా ఉంది. మొత్తం 42 పార్టీలపై ఏడీఆర్​ నివేదిక రూపొందించగా.. 14 మాత్రమే విరాళాల వివరాలను బయటపెట్టాయి.

  • భాజపాకు ఎదురుదెబ్బ

ఉత్తరాఖండ్​లో భాజపాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా రాజీనామా చేసిన సీనియర్​ నేత యశ్​పాల్​ ఆర్య (Yashpal Arya News).. ఆయన కుమారుడితో కలిసి కాంగ్రెస్​లో చేరారు.

  • 'నూతన సాగు చట్టాలపై సీఎం వైఖరేంటీ?'

నూతన సాగు చట్టాలపై సీఎం కేసీఆర్‌(CM kcr) వైఖరి తెలపాలని కాంగ్రెస్(TPCC) డిమాండ్ చేసింది. సాగుచట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులపై దాడి ఘటనను పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి(revanth reddy tpcc) ఖండించారు. ఉత్తర ప్రదేశ్ లఖింపుర్ ఘటనను నిరసిస్తూ హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద చేపట్టిన మౌన దీక్షలో ఆయన పాల్గొన్నారు.

  • 'అలాంటి వారికి ముందస్తు బెయిల్ ఉండదు'

దర్యాప్తు సంస్థలకు సహకరించకుండా తప్పించుకుని తిరిగే నిందితులను ధర్మాసనాలు కాపాడలేవని సుప్రీంకోర్టు (Supreme Court News) స్పష్టం చేసింది. 2017 అల్లర్ల కేసులో ఓ నిందితుడికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.

  • స్టాక్​ మార్కెట్లకు స్వల్ప లాభాలు 

స్టాక్ మార్కెట్లు (Stock Market) సోమవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ (Sensex Today) 77 పాయింట్లు పెరిగి 60,100 పైకి చేరింది. నిఫ్టీ (Nifty Today) 51 పాయింట్ల లాభంతో 17,950 మార్క్​కు చేరువైంది.

15:49 October 11

టాప్​ న్యూస్​ @4PM

  • విద్యాశాఖ కీలక నిర్ణయం...

ఈ ఏడాది పదో తరగతిలో 6 పరీక్షలే(ssc exams) నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 11 పేపర్లు ఉండేవి. ఈ సంవత్సరం 6 పరీక్షలే నిర్వహించాలని నిర్ణయించింది. ఒక్కో సబ్జెక్టుకు ఒక పరీక్షే నిర్వహించాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.  

  • నోబెల్​ వరించింది వీరినే..

ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి(nobel prize economics 2021 ) ఎంపికయ్యారు డేవిడ్​ కార్డ్​, జాషువా డీ. యాంగ్రిస్ట్, గైడో డబ్ల్యూ ఇంబెన్స్​. జాషువా, గైడోతో నోబెల్​ను పంచుకోనున్నారు డేవిడ్​ కార్డ్​.

  • గెజిట్​లో ఆ విధానం లేదు..

హైదరాబాద్​ జలసౌధలో గెజిట్ నోటిఫికేషన్ అమలుపై భేటీ అయిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం (GRMB Meeting) ముగిసింది. జీఆర్ఎంబీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ (GRMB Chairman Chandrasekhar Iyer)అధ్యక్షతన సమావేశం జరిగింది. ప్రభుత్వం ఆమోదిస్తేనే రాష్ట్ర ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి వెళ్తాయని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ స్పష్టం చేశారు. గెజిట్​లోని సీడ్ మనీ వ్యయం విషయంలో స్పష్టత అడిగినట్లు తెలిపారు.

  • పండుగల వేళ పైలం..

రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం సీజనల్​ వ్యాధులు ప్రబలతున్నాయని డీహెచ్​ శ్రీనివాసరావు హెచ్చరించారు. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం లేదా, కొవిడ్​ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కొవిడ్​ ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదని, పండుగలు, విందులు, షాపింగ్​ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ప్రజల్లో పండుగలు చేసుకోవాలని డీహెచ్​.. మీడియా సమావేశంలో వెల్లడించారు.

  • ఇంకా ఎవరైనా ఉన్నారా..?

తెలుగు అకాడమీ నిధులు కొల్లగొట్టిన కేసులో హైదరాబాద్​ సీసీఎస్​ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో తొమ్మిది మంది నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. మొత్తం నగదును ఎలా పంచుకున్నది. ఇంకా ఎవరెవరి హస్తం ఉన్నది కూపీ లాగుతున్నారు.

14:48 October 11

టాప్​ న్యూస్​ @3PM

  • సిర్పుర్కర్​ కమిషన్​ కార్యాలయానికి సజ్జనార్​

'దిశ’ అత్యాచార(disha case) కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ ఉదంతంపై ఏర్పాటైన జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌(justice sirpurkar commission) విచారణ కొనసాగుతోంది. షాద్‌నగర్ కోర్టు జడ్జిని కమిషన్​ సభ్యులు ప్రశ్నించారు. సిర్పుర్కర్ కమిషన్ కార్యాలయానికి అప్పటి సీపీ సజ్జనార్​ వచ్చారు. ఆయనను కమిషన్​ ప్రశ్నించే అవకాశం ఉంది. 

  • హుజూరాబాద్​లో దూసుకెళుతున్న కారు

హుజూరాబాద్ బైపోల్స్ కోసం మంత్రి హరీశ్ రావు తనదైనరీతిలో ప్రచారం(Harish rao campaign) చేస్తున్నారు. ఇల్లంతకుంట మండలం రాచపల్లి వెళ్తున్న మంత్రి... మార్గంమధ్యలో ఓ చిన్న టిఫిన్ సెంటర్​లో దోశ తినడం గమనార్హం. రోడ్డు పక్కన ఉన్న హోటల్​లో మంత్రి తినడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

  • మహారాష్ట్ర మాజీ హోంమంత్రి ఇంట్లో సీబీఐ సోదాలు​

అవినీతి ఆరోపణల కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్​ముఖ్​ (Anil Deshmukh news) నివాసాలు సహా పలు ప్రదేశాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. దేశ్​ముఖ్​పై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి కీలక పత్రాల లీకేజీ వ్యవహారంలో ముంబయి సహా పలు ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టారు సీబీఐ అధికారులు.

  • 15ఏళ్ల స్టూడెంట్​తో రిలేషన్​- గర్భవతి అయిన టీచర్ అరెస్ట్

15 ఏళ్ల విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకుని గర్భం దాల్చింది ఓ టీచర్. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. వాట్సాప్​లో ఇద్దరూ 'ఐ లవ్ యూ' అనే సందేశాలతో పాటు నగ్న చిత్రాలు పంపించుకున్నారని పోలీసులు తెలిపారు.

  • ఎన్టీఆర్​తో సమంత ఎందుకలా అంది!

యంగ్​టైగర్ ఎన్టీఆర్(ntr samantha movies)​ అన్న మాటకు హీరోయిన్​ సమంత అసహనం వ్యక్తం చేసింది! 'ముందే చెప్పాలి కదా' అంటూ డల్​ అయిపోయింది. ఇంతకీ తారక్​ ఏమన్నాడంటే?

13:48 October 11

టాప్​న్యూస్​@2PM

  •  ఐదుగురు జవాన్లు వీరమరణం

జమ్ముకశ్మీర్​ పూంచ్​ జిల్లా రాజౌరీ సెక్టార్​లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. అందులో జూనియర్​ కమిషన్డ్​ అధికారి(జేసీఓ) ఉన్నారు. జిల్లాలోని పిర్​ పంజాల్​ పరిధి, సురాంకోట్​ ప్రాంతంలో ఎన్​కౌంటర్​ జరగినట్లు జమ్ము రక్షణ విభాగం ప్రతినిధి తెలిపారు.  

  • చినజీయర్‌ స్వామిని కలిసిన సీఎం 

రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌ ఆశ్రమంలో త్రిదండి శ్రీరామనుజ చినజీయర్ స్వామి(Tridandi Sri Ramanuja Chinjiyar Swamy)ని సీఎం కేసీఆర్ (CM kcr) కలిశారు. కుటుంబసభ్యులతో కలిసి చినజీయర్‌స్వామిని కలిశారు. యాదాద్రి ఆలయ (yadadri temple) పునఃప్రారంభంపై చినజీయర్‌ స్వామితో కేసీఆర్ చర్చించారు. 

  •  సభాపతి  కాన్వాయ్‌ ఢీకొని వ్యక్తి మృతి

12:42 October 11

టాప్​న్యూస్​@1PM

 

  • కొనసాగుతున్న జీఆర్​ఎంబీ సమావేశం

గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం (GRMB meeting)  కొనసాగుతోంది. హైదరాబాద్ జలసౌధలో  జీఆర్ఎంబీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన భేటీ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. 

  •  'మా' ఎన్నికలపై బండి సంజయ్ కామెంట్స్ ఏంటి?

"మా" అధ్యక్షుడిగా గెలిచిన @iVishnuManchu గారితో సహా ఇరు ప్యానెల్ లోని విజేతలందరికి శుభాకాంక్షలు. జాతీయవాద వ్యతిరేక శక్తుల్ని చిత్తుగా ఓడించిన "మా" ఓటర్లకు ధన్యవాదాలు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న తుకుడే గ్యాంగ్ కు మద్దతిచ్చిన వారికి సరైన గుణపాఠం జరిగింది

  • 'అందుకే సంస్కరణలు'

గతంలో అంతరిక్ష రంగం అంటే ప్రభుత్వానికి పర్యాయపదంగా ఉండేదని, ఆ ఆలోచనా విధానాన్ని తాము మార్చామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రైవేటు సెక్టార్​లో ఆవిష్కరణలకు స్వేచ్ఛ ఇచ్చేందుకే సంస్కరణలు తీసుకొచ్చినట్లు చెప్పారు. ఇండియన్ స్పేస్​​ అసోసియేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ వర్చువల్​గా పాల్గొని మాట్లాడారు.

  • మహారాష్ట్ర బంద్​​- 9 బస్సులు ధ్వంసం

మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ పిలుపుమేరకు బంద్ కొనసాగుతోంది. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలన్నీ స్వచ్ఛందంగా నిలిచిపోయాయి. గుర్తుతెలియని వ్యక్తులు చేసిన రాళ్లదాడిలో 9 ప్రభుత్వ బస్సులు దెబ్బతిన్నాయి. దీంతో బస్సు సర్వీసులను బృహన్‌ ముంబయి కార్పొరేషన్‌ రద్దు చేసింది.

11:44 October 11

టాప్​న్యూస్​@12AM

  •  ప్రకాశ్​రాజ్​ రాజీనామా

'మా' ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిన ప్రకాశ్​రాజ్​ షాకింగ్​ నిర్ణయం తీసుకున్నారు. 'మా' ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

  • సీజేగా జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ప్రమాణస్వీకారం

తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి(Telangana High Court CJ)గా జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ(Justice Satish Chandra Sharma) ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్(Telangana Cm KCR)​తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

 

  •  'మెట్రో'నష్టానికి కారణాలేంటి?

హైదరాాబాద్ మెట్రో రైల్​ నష్టాలకు కొవిడ్​ కారణమా? లేదా ఇంకేమైనా కారణాలున్నాయా? అందుబాటులో కావాల్సినన్నీ భూములున్నా కూడా ఎల్‌అండ్‌టీ సరిగా వినియోగించుకోలేకపోతోందా? ఈ నేపథ్యంలో సంస్థ నష్టాలకు ఇతరత్రా కారణాలున్నాయా? అనేది దీనిపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ పరిశీలిస్తోంది.

  • భారీ అగ్ని ప్రమాదం

దిల్లీలో భారీ అగ్నిప్రమాదం(Delhi Fire News) సంభవించింది. హర్ష్ విహార్‌ ప్రాంతంలోని పేపర్‌ రోల్స్‌ నిల్వ చేసిన గోదాంలో తెల్లవారుజామున భారీగా మంటలు చెలరేగాయి.

  • '5జీ కంటే 50రెట్ల వేగం'

4జీతో పోలిస్తే 5జీ 10 రెట్లు వేగవంతమైంది కాగా, 5జీ కంటే సుమారు 50 రెట్లు వేగంగా 6జీ పని చేస్తుందని టెలికాం కార్యదర్శి కె.రాజారామన్‌ పేర్కొన్నారు. 6జీ(6G In India) ఇతర భవిష్యత్​ తరం సాంకేతికతలపై పరిశోధన చేయాలని ప్రభుత్వరంగ టెలికాం పరిశోధన, అభివృద్ధి సంస్థ(సి-డాట్‌)ను ఆయన కోరారు.

10:52 October 11

టాప్​న్యూస్​@11AM

  • 10 గేట్లు ఎత్తి నీటి విడుదల

ఎగువ నుంచి వస్తోన్న వరద ప్రవాహంతో నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా మారింది. తెల్లవారుజాము నుంచి వరద పెరగడం వల్ల అధికారులు 10 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు.

 

  • పెరిగిన విద్యుత్‌ వాహనాలు

కాలుష్య నియంత్రణ కోసం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని (Electric Vehicles in Telangana) పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానం (telangana government ) ఊతమిస్తుంది. దీనితో తెలంగాణలో విద్యుత్​ వాహనాల వినియోగం (Increased Electric Vehicles in Telangana) భారీగా పెరిగింది.

 

  • ' చర్చల్లో పురోగతి శూన్యం'

చైనాతో జరిగిన 13వ విడత సైనిక చర్చల్లో (India China talks) సరిహద్దు సమస్యకు (India China standoff) పరిష్కారం దిశగా ఎలాంటి పురోగతి లభించలేదని భారత సైన్యం ప్రకటించింది. పరిష్కారం కోసం భారత్ చేసిన నిర్మాణాత్మక సూచనలను.. చైనా అంగీకరించలేదని తెలిపింది. (India China latest news)

  •  యువకుడిపై అఘాయిత్యం

ఓ యువకుడిపై మరో వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బైక్​పై డ్రాప్ చేస్తానని బాధితుడిని నమ్మించిన నిందితుడు.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి, అతనిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

  • త్వరలోనే 'ఆర్య 3'.

అల్లు అర్జున్‌-సుకుమార్‌ల(arya sukumar)కలయికలో వచ్చిన 'ఆర్య' సిరీస్‌ చిత్రాలు ఎంతగా హిట్​ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడా సిరీస్​లో భాగంగా 'ఆర్య 3'(Arya 3 movie) తీసుకురానున్నట్లు తెలిపారు దర్శకుడు సుకుమార్​.

09:48 October 11

టాప్​న్యూస్​@10AM

  • అక్కడ పరీక్షలిక చకచకా..!

ఉస్మానియా ఆసుపత్రి (Osmania Hospital )అత్యవసర విభాగంలో ఆటోమేటిక్‌ బయోకెమిస్ట్రీ ఎనలైజర్‌ను అందుబాటులోకి తేవడంతో రోగులకు ఎంతో మేలు చేకూరుతోంది. నిమిషాల్లో పరీక్షల నివేదికలు వస్తుండటంతో సాధ్యమైనంత త్వరగా గోల్డెన్‌ అవర్‌లో చికిత్సలు అందిస్తున్నారు.

  •  అగ్రస్థానంలో హైదరాబాద్

నిర్మాణ రంగంలో భాగ్యనగరం(Construction Field in Hyderabad) దూసుకెళ్తోంది. స్థిరాస్తి రంగంలో దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్​ దూకుడు పెరిగింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు, కొత్త ప్రాజెక్టుల ప్రారంభాల్లో దేశంలోనే ఈ మహానగరం నంబర్​ వన్​గా నిలిచింది.

  •  మరో 18వేల కేసులు

దేశంలో కొత్తగా 18,132 మంది​కి కొవిడ్(Coronavirus update) ​​​సోకినట్లు తేలింది. వైరస్ ధాటికి(Covid cases in India) మరో 193 మంది మృతి చెందారు. మరో 21వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు.

  •  టీకా వేసుకుంటే వంటనూనె, ఫోన్లు!

టీకా పంపిణీలో వందశాతం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రోత్సాహకాలు(Vaccine Offers) ప్రకటిస్తున్నారు. వ్యాక్సిన్​ వేసుకున్నవారికి వంటనూనె ప్యాకెట్లతో పాటు లక్కీడ్రాలో ఫోన్లను అందజేస్తోంది గుజరాత్​లోని అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్​

  •  మహిళపై గ్యాంగ్ రేప్

ఉత్తర్​ప్రదేశ్​లోని గ్రేటర్ నోయిడాలో 55 ఏళ్ల మహిళపై (Noida Gang Rape victim) సామూహిక అత్యాచారం జరిగింది. పశువుల మేత కోసం గడ్డి తీసుకొచ్చేందుకు అడవికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. పశువులకు కాపలా కాస్తున్న ఓ వ్యక్తి మరో ముగ్గురితో కలిసి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. (Noida news today)

08:56 October 11

టాప్​న్యూస్​@9AM

  • ధరణి పోర్టల్‌లో వివరాలెందుకు లేవు? 

రాష్ట్రవ్యాప్తంగా ఎసైన్ట్​ భూములపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి భూమిపై శాశ్వత హక్కులు లేకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ఈ భూములను తెగనమ్ముకుంటున్న దుస్థితి కూడా ఏర్పడింది. ధరణి పోర్టల్‌లో వాటి వివరాలు లేక రుణాలు అందడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం నుంచి పొందిన ఎసైన్డ్‌ భూమిపై పదేళ్ల అనంతరం లబ్ధిదారులకు శాశ్వత హక్కులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

  •  ఇవాళ, రేపు వర్షాలు!

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ఫలితంగా ఈరోజు, రేపు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం (Telangana Weather Report) ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది.

  • ఆ మరణాలకు బాధ్యులెవరు?

చినుకు పడితే భాగ్యనగర వాసుల్లో దడ మొదలవుతోంది. వర్షం కురిసినరోజు.. ఇళ్ల నుంచి బయటకు వెళ్లిన వారు తిరిగొస్తారా లేదోనని వారి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. పని మీద బయటకు వెళ్లిన వారు.. ఇంటికి వెళ్లడం కాస్త ఆలస్యమైనా.. వారు ఏ నాలాలో కొట్టుకుపోయారోనని వారి కుటుంబం పడే ఆందోళన వర్ణనాతీతం. గ్రేటర్​లోని నాలాల్లో పడి గడిచిన నాలుగు నెలల్లో ఎంతో మంది గల్లంతయ్యారు. మరికొంత మంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదాలకు కారణం ఎవరు? ఈ మరణాలకు బాధ్యత వహించేదెవరు?

  •  ఇద్దరు ముష్కరులు హతం!

జమ్ముకశ్మీర్​లో ఉగ్రఏరివేత కొనసాగుతోంది. బందిపొరాలో ఓ పౌరుడి హత్య కుట్రలో భాగమైన నలుగురు ఉగ్ర అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు.. బందిపొరా, అనంత్​నాగ్​ జిల్లాల్లో జరిగిన ఎన్​కౌంటర్లలో ఇద్దరు ముష్కరులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.

  • వరుసగా ఏడో రోజూ పెట్రో వాత

పెట్రోల్ ధరలు (Petrol Price today) దేశంలోని సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. వరుసగా ఏడో రోజూ ఇంధన ధరలు పెరిగాయి. దీంతో దిల్లీలో పెట్రోల్ ధరలు (Petrol Price in Delhi) జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి.

07:56 October 11

టాప్​న్యూస్​@8AM

  • పెట్రో వాత.. వరుసగా ఏడో రోజు

పెట్రోల్ ధరలు (Petrol Price today) దేశంలోని సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. వరుసగా ఏడో రోజూ ఇంధన ధరలు పెరిగాయి. దీంతో దిల్లీలో పెట్రోల్ ధరలు (Petrol Price in Delhi) జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి.

  • మీరు చేసే సాయంతోనే

నల్గొండ జిల్లా చిట్యాల మండలం (nalgonda chityal)పెద్దకాపర్తికి చెందిన ఓ కుటుంబానికి ఊహించని కష్టం వచ్చింది. 11 నెలల బాలుడి ఒంటిపై వేడిపాలుపడి 38శాతం కాలిపోయింది. రెక్కలకష్టంమీద ఆధారపడి బతికే బతికే ఆ దంపతులు.. ప్రాణాపాయంతో కొట్టిమిట్టాడుతున్న బిడ్డను దక్కించుకోడానికి దాతల సాయం అర్థిస్తున్నారు(please save my child).

  • దేశంలో ఎవరికీ భద్రత లేదు

రైతుల ప్రాణాలు కోల్పోవడానికి కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్​ మిశ్రా, అతని కుమారుడు ఆశిష్​ను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi News) ఆరోపించారు. భాజపా నేతలకు, వారి బిలీనియర్ మిత్రులకు తప్పిస్తే.. దేశంలో ఎవరికీ రక్షణ లేదని విమర్శించారు.

  • భాజపా ఎమ్మెల్యే కారుపై బాంబు దాడి!

భాజపా ఎమ్మెల్యేపై బాంబు దాడి (Bomb Attack News) జరిగింది. ఒడిశా అసెంబ్లీలో చీఫ్​విప్​గా వ్యహహరిస్తున్న మోహన్​ చరణ్​ మాఝిపై గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బాంబులు విసిరారు. ఎమ్మెల్యే, అతని వ్యక్తిగత భద్రతా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.

  • ఎలిమినేటర్‌లో నిలిచేదెవరో?

తొలి ఐపీఎల్‌ టైటిల్‌ వేటలో సాగుతోన్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB vs Kolkata) కఠిన పరీక్షకు సిద్ధమైంది. ఆర్సీబీ కెప్టెన్‌గా ఇదే తన చివరి సీజన్‌ అని ప్రకటించి.. జట్టుకు తొలి ట్రోఫీ అందించే దిశగా పయనిస్తున్న కోహ్లీకి మరో సవాలు ఎదురు కానుంది. సోమవారం ఎలిమినేటర్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే ఇంటి ముఖం పట్టాల్సిందే కాబట్టి విజయం కోసం రెండు జట్లు హోరాహోరీగా తలపడడం ఖాయం.

07:56 October 11

టాప్​న్యూస్​@7AM

  • పదవుల కోసం అలా మాట్లాడితే లోకువైపోతాం

తాత్కాలికమైన(Chiranjeevi latest movie) పదవుల కోసం విమర్శలు చేసుకుంటే బయట వాళ్లకి లోకువైపోతామన్నారు మెగాస్టార్​ చిరంజీవి. హీరోల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని చెప్పారు.

  • ప్రాజెక్టులపై ఎటూ తేల్చని రాష్ట్రాలు..

హైదరాబాద్‌లోని జలసౌధలో ఆదివారం కృష్ణా, గోదావరి బోర్డుల ఉప సంఘాల సమావేశాలు (Meetings of Sub-Committees of Krishna and Godavari Boards) జరిగాయి. ఈ సందర్భంగా ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి సమాచారం అందజేయకపోవడంపై అసంపూర్తిగా సమావేశం ముగిసింది.

  • సాహసోపేత నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్.. మోదీ

ప్రజాస్వామ్యయుతంగా సాహసోపేత నిర్ణయాలు తీసుకొనే శక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తప్ప మరొకరికి లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah News) అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో మోదీ లాంటి శ్రోతను తానెప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. పేదల కోసం మోదీ తీసుకున్నన్ని సంక్షేమ చర్యలు దేశంలో ఎవరూ చేపట్టలేదన్నారు.

  • మీ పిల్లలకు డ్రగ్స్ అలవాటుందా..

ఓసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో అని సిగగెట్, మద్యంతో మొదలుపెట్టి నెమ్మదిగా డ్రగ్స్​ వెళ్తోంది నేటి యువత. ఒక్కసారి టేస్ట్ చూశాక.. అదిచ్చే కిక్​కు అలవాటు పడి ఎంతో మంది యువకులు ఆ మత్తు మాయలో జీవితాలు చిత్తు చేసుకుంటున్నారు. అది సీరియస్ అయ్యే వరకు వారి తల్లిదండ్రులకు తెలియడం లేదు. తమ పిల్లలకు డ్రగ్స్ ఎలా అలవాటయ్యాయో తెలియక కన్నవాళ్లు తలలు పట్టుకుంటున్నారు. పిల్లలు మత్తుకు బానిసవుతున్నారో లేదో తెలుసుకోవాలంటే...

  • సింగరేణి కీలక నిర్ణయం..

దేశంలో బొగ్గుకు డిమాండ్​ పెరుగుతోంది. తెలంగాణ సింగరేణి(Telangana Singareni) ఇందులో కీలకంగా మారింది. దక్షిణ రాష్ట్రాలకే గాక.. ఉత్తర రాష్ట్రాలకూ సింగరేణి బొగ్గు పంపుతోంది. 

05:01 October 11

టాప్​న్యూస్​@6AM

  • హైకోర్టు సీజే ప్రమాణ స్వీకారం

రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా(Telangana high court cj) జస్టిస్ సతీశ్​ చంద్ర శర్మ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ ఉదయం 11:05 నిమిషాలకు రాజ్ భవన్​లో గవర్నర్ తమిళిసై ఆయన చేత ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, న్యాయమూర్తులు హాజరు కానున్నారు.

  •  జీఆర్​ఎంబీ సమావేశం

గెజిట్ నోటిఫికేషన్ అమలుపై గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఇవాళ సమావేశం కానుంది. ఈనెల 14వ తేదీ నుంచి పెద్దవాగు ప్రాజెక్టు నిర్వహణ విషయమై భేటీలో చర్చించనున్నారు. నిన్న అసంపూర్తిగా జరిగిన కృష్ణా బోర్డు ఉపసంఘం సమావేశం ఇవాళ కూడా కొనసాగనుంది.

  •  ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీల్లేవు

దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్​ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా నడిపే ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ స్పష్టం చేశారు. కరోనా సమయంలో ప్రజలపై అదనపు భారం మోపకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

  •  రాష్ట్రంలో డెంగీ విజృంభణ

రాష్ట్రంలో చాపకింద నీరులా డెంగీ విజృంభిస్తోంది. కేవలం 5 వారాల్లోనే 2,443 మంది కొత్తగా డెంగీ బారిన పడ్డారు. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో స్వీయ నియంత్రణ పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

  •  నేటి నుంచే దరఖాస్తులు

వృద్ధాప్య ఫించన్ల(Aasara Pension in Telangana) కోసం నేటి నుంచే దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాష్ట్రంలోని మీ సేవ, ఈ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. పింఛను వయసును 57కు తగ్గిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

  • విస్తరిస్తున్న చీకటి వ్యాపారం..!

మాదకద్రవ్యాల ముఠాలు వేల కోట్ల రూపాయల వ్యాపారం సాగిస్తున్నాయి. యువకులను మత్తుకు బానిసలుగా మారుస్తూ వారి భవిష్యత్తుతో, ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రపంచ మాదక ద్రవ్య నివేదిక-2020 ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మత్తుపదార్థాల వినియోగం ఏటా పెరుగుతోంది.

  •  
  • 'తొందరగా బలగాలను ఉపసంహరించండి'

సరిహద్దుల్లోని దెప్సాంగ్​ సహా ఉద్రిక్త ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ (Eastern Ladakh Standoff) ప్రక్రియను వేగవంతం చేయాలని చైనాకు ఆదివారం జరిగిన 13వ విడత కార్ప్స్‌ కమాండర్ స్థాయి చర్చల్లో భారత్ స్పష్టం చేసింది. చైనా వైపు ఉన్న మోల్డో బార్డర్​ పాయింట్​లో ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభమైన ఈ చర్చలు సాయంత్రం ఏడు గంటల వరకు సాగాయి.

  • ఉత్తర కొరియాకు ఎదురు దెబ్బ

ఉత్తర, దక్షిణ కొరియాలు రోజుల వ్యవధిలో పోటాపోటీగా క్షిపణి (North Korea Missile) పరీక్షలు నిర్వహించాయి. వీటిపై అమెరికా 'వ్యూహాత్మక సహనం' ప్రదర్శిస్తోంది. మరోవైపు ఉత్తర కొరియా తీవ్ర ఆహార కొరత ఎదుర్కొంటోంది.

  •  మంచు విష్ణు విజయం

'మా' కొత్త అధ్యక్షుడిగా మంచు విష్ణు ఘన విజయం సాధించారు. ప్రకాశ్​రాజ్​పై గెలిచి ప్రెసిడెంట్​గా బాధ్యతలు అందుకున్నారు.

  • ఫైనల్లో సీఎస్​కే

దుబాయ్​ వేదికగా జరిగిన తొలి క్వాలిఫైయర్స్​లో దిల్లీపై చెన్నై విజయం సాధించింది. దీంతో సీఎస్​కే ఫైనల్​కు దూసుకెళ్లింది.

Last Updated : Oct 11, 2021, 9:58 PM IST

ABOUT THE AUTHOR

...view details