ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుశివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు రాష్ట్రవ్యాప్తంగా శైవాలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇవాళ తెల్లవారుజామునుంచే మహాదేవుడు ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. వేకువ జామునుంచే భక్తులు శైవాలయాలకు పోటెత్తారు.పరమేశ్వరుడు చెప్పిన శివరాత్రి కథశివరాత్రి పర్వదినం ఉపవాస, జాగరణలతో కూడి మిగతా పర్వదినాలకన్నా కొంత భిన్నంగా కనిపిస్తుంది. రాత్రిపూట పూజాదికాలు జరపటం ఈ పండుగ నాడు చూస్తాం. బిల్వపత్రార్చనలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్షమాలాధారణలు, విభూతి ధారణలు శివరాత్రినాడు శివుడి ప్రీతికోసం భక్తులు చేస్తుంటారు. అయితే కేవలం ఇలా ఏదో పూజలు, అభిషేకాలతో శివుడిని అర్చించి మళ్లీ యథావిధిగా ఆ తర్వాత రోజున జీవితం గడపటమేనా? మరి ఈ పండుగ వల్ల ఏదైనా ఇతర ప్రయోజనం ఉందా? అని కాస్తంత హేతుబద్ధంగా ఆలోచిస్తే ఉన్నది అనే సమాధానమే కనిపిస్తుంది. ఈ సమాధానానికి ఉదాహరణగా లింగపురాణంలో ఓ చక్కటి కథ ఉంది.రియల్టర్లపై కాల్పులు.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో.. స్కార్పియో వాహనంపై ఒక్కసారిగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆ సమయంలో వాహనంలో ఇద్దరు స్థిరాస్థి వ్యాపారులు ఉన్నారు. వారిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కాల్పులు ఎవరు జరిపారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.ప్రెసిడెంట్ పుతిన్ 'అణ్వస్త్రం' ప్రయోగిస్తారా?..ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణ్వాయుధాన్ని ప్రయోగిస్తారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆదివారం.. రష్యా అణ్వస్త్ర దళాలకు పుతిన్ ఆదేశాలతో ఈ అనుమానం కలుగుతోంది. రష్యాను నాశనం చేయాలనుకునేవారిపై దీటుగా స్పందించే హక్కు తమకుందని నాలుగేళ్ల కిందటే పుతిన్ ప్రపంచాన్ని హెచ్చరించారు. ప్రస్తుత తరుణంలో అవకాశం లేదని.. కానీ కొట్టిపారేయలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఉక్రెయిన్- రష్యా చర్చలు అసంపూర్ణం.. ఉక్రెయిన్- రష్యా తొలివిడత చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. రెండు దేశాల బృందాలు బెలారస్ సరిహద్దు సమీపంలో దాదాపు ఐదు గంటలు చర్చలు జరిపాయి. తక్షణం యుద్ధ విరమణ చేయాలని ఉక్రెయిన్.. రష్యాను డిమాండ్ చేసింది. ప్రాథమిక డిమాండ్లపై ఇరువర్గాలు తమ పట్టు సడలించకపోవడంతో చర్చల్లో ఎలాంటి ముందడుగు పడలేదు. ఈయూలో చేర్చుకోవాల్సిందిగా కోరుతూ సంబంధిత దరఖాస్తుపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంతకం చేయడం కీలక పరిణామం. ఉక్రెయిన్ గగనతలం తమ అదుపులో ఉందని రష్యా ప్రకటించింది.డిస్కౌంట్ షురూ..పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను రాయితీపై ఇవాళ్టి నుంచి క్లియర్ చేసుకోవచ్చు. మంగళవారం నుంచి మార్చి 31 వరకు పెండింగ్ చలానాలు చెల్లించవచ్చు. ఈ మేరకు అధికారులు ఇదివరకే ప్రకటించారు. తొలి 8 గంటల్లో లక్షా 77వేల చలానాలను వాహనదారులు చెల్లించారు.ఇక డయల్ 100కే ఎస్‌వోఎస్ సందేశం.. తెలంగాణ పోలీసుల ఆపన్న హస్తం మరింత వేగిరం కానుంది. ఇక డయల్ 100కే ఎస్‌వోఎస్ సందేశం నేరుగా వెళ్లనుంది. ఇప్పటికే 29 లక్షల మంది వినియోగిస్తున్న హాక్ ఐ యాప్‌లో త్వరలోనే మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నారు. నేరుగా డయల్ 100 కేంద్రానికే సమాచారం చేరేలా మార్పు చేస్తున్నారు.దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులుదేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కొత్తగా 6,915 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో 180 మంది మృతి చెందారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 11,01,750 కేసులు వెలుగుచూశాయి.ఐపీఎల్ కొత్త జట్టుకు భారీ షాక్.. ఐపీఎల్లో ఈ ఏడాది కొత్తగా చేరిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు జేసన్ రాయ్ వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.ప్రెగ్నెన్సీ వేళ కాజల్ ఏరోబిక్ ఎక్సర్సైజ్..ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ తల్లి కాబోతుంది. గత కొన్ని రోజులుగా బేబీ బంప్ సహా సీమంతం ఫొటోలను ఇన్‌స్టాలో పంచుకుంటోంది. తాజాగా బేబీ బంప్‌తో జిమ్‌లో ట్రైనర్ సాయంతో కసరత్తులు చేస్తున్న వీడియోను షేర్ చేసింది. గర్భిణిలు చేయాల్సిన కసరత్తులకు సంబంధించి పలు సలహాలు సూచనలు చేసింది. ఆ విశేషాలన్నీ ఆమె మాటల్లోనే..