తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్ న్యూస్
టాప్​టెన్ న్యూస్ @11AM

By

Published : Feb 17, 2022, 10:58 AM IST

  • దేశంలో స్థిరంగా కరోనా కేసులు

India covid cases: దేశంలో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. వరుసగా రెండోరోజూ 30 వేలకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. కొత్తగా 30,757‬ మందికి కరోనా నిర్ధరణ అయింది. మరో 541 మంది మరణించారు. 67,538 మంది బాధితులు కోలుకున్నారు.

  • మేడారం జాతరలో రెండో రోజూ కోలాహలం

దక్షిణ కుంభమేళా.. ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర.. మేడారం మహాజాతరలో రెండు దశాబ్ధాల తర్వాత అద్భుత ఘట్టం చోటుచేసుకుంది. 20 ఏళ్లలో మాఘశుద్ధ పౌర్ణమి రోజు మహాజాతర ప్రారంభమవ్వడం ఇదే తొలిసారి. ఆదివాసీ జనజాతరకు రెండో రోజు కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివస్తోన్న భక్తులతో అమ్మవారి ప్రాంగణం కిటకిటలాడుతోంది.

  • పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అరెస్ట్

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్​లో పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్​లోని నివాసంలో ఆయణ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ నిరసనలు తెలపాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. వివిధ రకాలుగా నిరసనలు తెలపాలని యువజన కాంగ్రెస్​కు రేవంత్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆయణ్ను అరెస్టు చేశారు.

  • కాకతీయ కాల్వలోకి దూకిన ప్రేమజంట

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్​ వద్ద కాకతీయ కాల్వలో ఓ ప్రేమజంట దూకింది. అటుగా వెళ్తున్న వారు ఈ ఘటన చూసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. ఈతగాళ్లతో వాకి కోసం కాల్వలో గాలింపు చర్యలు చేపడుతున్నారు.

  • సత్యవతి రాఠోడ్​కు పితృవియోగం

తెలంగాణ గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాఠోడ్​ తండ్రి లింగ్యా నాయక్ కన్నుమూశారు. మహహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలోని నివాసంలో అనారోగ్యంతో మరణించారు. తండ్రి మరణ వార్త తెలుసుకున్న మంత్రి.. మేడారం పర్యటన నుంచి బయలుదేరారు.

  • డాడ్.. యూ ఆర్ మై హీరో..

సీఎం కేసీఆర్​కు ఆయన తనయుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ భావోద్వేగకరంగా పుట్టిన రోజు విషెస్ చెప్పారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే అలవాటుగా కేసీఆర్ మార్చుకున్నారని కేటీఆర్ కొనియాడారు. దయతో నిండిన హృదయంతో అందర్ని ముందుకు నడిపిస్తారని అన్నారు. కేసీఆర్​కు.. సవాళ్లను ధైర్యం ఎదుర్కొనే సత్తా ఉందని తెలిపారు. ''నా నాయకుడు.. నా తండ్రి.. అని'' గర్వంగా పిలుచుకుంటానని ట్విటర్ వేదికగా కేటీఆర్ ఎమోషనల్​ పోస్ట్ చేశారు.

  • దస్తగిరి సాక్ష్యం తప్పనిసరి

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నాలుగో నిందితుడు, మృతుడి మాజీ డ్రైవర్‌ షేక్‌ దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు అనుమతిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఏపీ హైకోర్టు సమర్థించింది. దస్తగిరి అప్రూవర్‌గా మారడానికి కడప చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు అనుమతించడాన్ని సవాలుచేస్తూ నిందితులు ఎర్ర గంగిరెడ్డి (ఏ1), గజ్జల ఉమాశంకర్‌రెడ్డి (ఏ3) దాఖలు చేసిన వ్యాజ్యాలను కొట్టేసింది.

  • ఒడుదొడుకుల్లో స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతోంది. సూచీలు ఒడుదొడుకుల మధ్యే ట్రేడింగ్ సాగిస్తున్నాయి. లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్.. క్రమంగా నష్టాల్లోకి మళ్లింది. ప్రస్తుతం 120 పాయింట్లు కోల్పోయి.. 58 వేల మార్క్ దిగువన ట్రేడవుతోంది.

  • మూడో టీ20కు అభిమానులకు అనుమతి

వెస్టిండీస్​తో జరగబోయే మూడో టీ20 మ్యాచ్​కు పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించనున్నారు. కరోనా వైరస్ ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో అభిమానులను అనుమతించాలని బంగాల్ క్రికెట్​ సంఘం చేసిన అభ్యర్థనను బీసీసీఐ అంగీకారం తెలిపింది.

  • ఆలియా సినిమాపై గంగూబాయ్​ తనయుడు ఫైర్

బాలీవుడ్​ హీరోయిన్​ నచింటిన 'గంగూబాయ్​ కతియావాడీ' సినిమాపై గంగూబాయ్​ కుటుంబసభ్యులు అసహనం వ్యక్తం చేశారు. ఈ చిత్రం వల్ల తమ కుటుంబం అవమానాలను ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈ చిత్రం కోసం తన తల్లిని వేశ్యగా మార్చారని ఆరోపించారు గంగూబాయ్​ తనయుడు.

ABOUT THE AUTHOR

...view details