తెలంగాణ

telangana

By

Published : Feb 16, 2022, 12:59 PM IST

ETV Bharat / city

Top News Today : టాప్​టెన్​ న్యూస్​@ 1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Top News Today
తెలంగాణ వార్తలు

  • సీఎం కేసీఆర్​కు ఉద్దవ్ ఠాక్రే ఫోన్..

దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కేంద్రంపై యుద్ధం ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలకు మద్దతు పెరుగుతోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే... సీఎం కేసీఆర్​కు ఫోన్‌చేసి ముంబయికి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఈనెల 20న కేసీఆర్‌ ముంబయి వెళ్లనున్నారు.

  • హైదరాబాద్​లో అసోం సీఎంపై కేసు

అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాహుల్‌ గాంధీపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల క్రితం కాంగ్రెస్‌ నేతలు 7 వందలకు పైగా పోలీస్‌ స్టేషన్‌లలో ఫిర్యాదు చేశారు.

  • డోభాల్ ఇంట్లోకి చొరబాటుకు యత్నం...

ఎన్ఎస్ఏ అజిత్ డోభాల్ ఇంట్లోకి చొరబాటుకు యత్నించిన వ్యక్తిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

  • జనసంద్రంగా మేడారం..

మేడారం పరిసరాలు కిక్కిరిసిపోతున్నాయి. జంపన్నవాగులో స్నానాలు ఆచరించిన భక్తులు.. సమ్మక్క- సారలమ్మలను దర్శించుకుంటున్నారు. దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. జాతరలో కొబ్బరికాయలు, బంగారు(బెల్లం) ధరలు కొండెక్కాయని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

  • బాలికతో వ్యభిచారం కేసు.. మరో 11మంది అరెస్టు

ఏపీలోని గుంటూరు జిల్లాలో సంచలనం రేపిన బాలిక అత్యాచారం కేసులో.. తాజాగా 11 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తల్లిలేని ఆ బాలికను మాయమాటలతో ఓ మహిళ తనవెంట తీసుకెళ్లి.. బలవంతంగా వ్యభిచారం చేయించింది. ఈ కేసులో ఇప్పటివరకు 61 మంది అరెస్టయ్యారు.

  • 'ఈశాన్య దిల్లీ అల్లర్లపై పోలీసుల దర్యాప్తు భేష్'

దిల్లీ పోలీస్ రైజింగ్ డే పరేడ్​లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈశాన్య దిల్లీ అల్లర్లపై ఇక్కడి పోలీసులు చేస్తున్న దర్యాప్తును ప్రశంసించారు. భవిష్యత్ కార్యాచరణపై దృష్టిసారించాలని పిలుపునిచ్చారు.

  • ప్రధాని మోదీ చెక్క భజన..

దిల్లీ కరోల్​బాఘ్​లోని శ్రీ గురు రవిదాస్ విశ్రమ్ ధామ్​ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన.. కీర్తనలో పాల్గొన్నారు.

  • 'రష్యాపై నమ్మకం లేదు.. ఉక్రెయిన్‌పై దాడి జరగొచ్చు'

ఉక్రెయిన్​పై రష్యా బలగాలు దాడి చేసే అవకాశం ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ అన్నారు. రష్యా యుద్ధానికి దిగితే స్వయంగా గాయం చేసుకున్నట్లే అవుతుందని రష్యా అధ్యక్షుడిని జో బైడన్‌ ఘాటుగా హెచ్చరించారు.

  • IND VS WI: ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు కలిసిన వేళ!

వెస్టిండీస్​తో జరగనున్న తొలి టీ20 మ్యాచ్​కు ముందు దిగ్గజ క్రికెటర్లు గంగూలీ, రాహుల్​ ద్రవిడ్​ కలిసి ముచ్చటించారు. వీరిద్దరూ కలిసి మ్యాచ్​ వేదికైన ఈడెన్​ గార్డెన్స్​ మైదానాన్ని పరిశీలించారు. దీనికి సంబంధించిన ఫొటోను బీసీసీఐ ట్వీట్​ చేసింది.

  • 'బప్పి లహిరి ఎప్పటికీ గుండెల్లో నిలిచిపోతారు'

ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పి లహిరి (69) మృతి పట్ల పలువురు సినీ, క్రీడా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా బప్పితో తమకున్న అనుబంధాన్ని తెలుపుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details