తెలంగాణ

telangana

By

Published : Feb 16, 2022, 9:03 AM IST

ETV Bharat / city

Top News Today : టాప్​టెన్ న్యూస్ @ 9AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana news
తెలంగాణ టాప్​టెన్ న్యూస్

  • మ్యూజిక్​ డైరెక్టర్​ బప్పి లహిరి కన్నుమూత

సంగీత దర్శకుడు, గాయకుడు బప్పి లహిరి(69) కన్నుమూశారు. గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబయిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

  • పోలీసు శాఖలో 17వేల పోస్టులు ఖాళీ

ఎంతో కాలంగా యువత ఎదురుచూస్తున్న పోలీసు ఉద్యోగ నియామకాల ప్రకటన త్వరలో రానున్నట్లు తెలుస్తోంది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్ర పోలీసు శాఖలో 17వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. త్వరలో ఈ ఉద్యోగాల భర్తీకీ ప్రకటన విడుదలయ్యే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  • నేటి నుంచి ఉదయాస్తమాన సేవాటికెట్ల మంజూరు

ఖాళీ అయిన 531 ఉదయాస్తమాన సేవా టికెట్లను దాతలకు అందుబాటులో ఉంచారు. శుక్రవారమైతే రూ.1.5 కోట్లు, మిగిలిన రోజుల్లో రూ.కోటి దాతలు విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది.

  • 'మత్తు చిందులు'..

రాష్ట్రంలోని చాలా ఔషధ దుకాణాల్లో చీటీలు లేకుండానే మాత్రల విక్రయాలు జరుగుతున్నాయి. డిప్రెషన్‌, నొప్పి, దగ్గు ఔషధాలు వైద్యుడి చీటీ ఉంటేనే ఇవ్వాల్సి ఉంటుంది. కానీ విచ్చలవిడిగా వీటిని అమ్మేస్తున్నారు. గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన తనిఖీల్లో 200కి పైగా దుకాణాల్లో నిబంధనలను పాటించడంలేదని అధికారులు గుర్తించారు. టిని సత్వరమే మూసివేయించామని, దుకాణదారులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నట్లు ఔషధ నియంత్రణ సంస్థ తెలిపింది.

  • జిల్లాల్లోనూ అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు

ఇప్పటి వరకు హైదరాబాద్​కే పరిమితమైన అవయవ మార్పిడి చికిత్సలను ఇక నుంచి జిల్లాలకు విస్తరించేందుకు అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని జీవన్​దాన్ ట్రస్టు దీనికోసం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఒక్కో వ్యక్తి నుంచి సేకరించిన అవయవాలతో ఏడుగురికి పునర్జన్మ ప్రసాదించే వీలుందని.. అవయవదానంపై ప్రజల్లో ఇంకా అవగాహన పెరగాలని జీవన్​దాన్ ట్రస్ట్ చెబుతోంది. ప్రభుత్వ వైద్యులకు దీనిపై అవగాహన కల్పించి.. వైద్యకళాశాలల్లోని అనుబంధ ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి చికిత్సలకు శ్రీకారం చుట్టాలని యోచిస్తున్నట్లు వెల్లడించింది.

  • హైదరాబాద్​లో అంతర్జాతీయ సంప్రదాయ వైద్యకేంద్రం

భాగ్యనగర కిరీటంలో మరో కలికితురాయి చేరనుంది. మరో ప్రతిష్ఠాత్మక వైద్యసంస్థకు ఈ మహానగరం వేదిక కాబోతోంది. అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్రాన్ని హైదరాబాద్​లో నెలకొల్పడానికి డబ్ల్యూహెచ్​ఓ ముందుకొచ్చింది. ప్రధాని కార్యాలయం నుంచి ప్రతిపాదన రావడంతో స్థల సేకరణకు రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తోంది.

  • తొలి రెండు దశల్లో ఎస్పీ కూటమికే పట్టం!

యూపీలో ముస్లిం ఓటర్లంతా ఈసారి సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కూటమి వైపు మొగ్గుచూపినట్లు విశ్లేషణలొస్తున్నాయి. గతేడాది బంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇతర లౌకికవాద పార్టీల వైపు మొగ్గుచూపితే తమ ఓట్లు చీలిపోయి భాజపా విజయావకాశాలు పెరుగుతాయని గ్రహించి.. గంపగుత్తగా తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఓటేశారు. ఇప్పుడు పశ్చిమ యూపీలోనూ అదే జరిగి ఉంటుందని అంచనా.

  • ముగ్గురు దివంగత న్యాయమూర్తులకు సీజేఐ ​నివాళి

దివంగత జస్టిస్‌ కస్లివాల్‌, జస్టిస్‌ పి.బి.సావంత్‌, జస్టిస్‌ సురిందర్‌ సింగ్‌ నిజ్జర్‌లు న్యాయవ్యవస్థకు అందించిన విశేష సేవలకు గుర్తింపుగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులంతా మంగళవారం సమావేశమై నివాళులర్పించారు. ఆ ముగ్గురు న్యాయమూర్తులు న్యాయవ్యవస్థకు అందించిన సేవలను శ్లాఘించారు.

  • ఆంగ్లేయులు సెల్యూట్‌ చేసిన దళిత వీరాంగన

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం అనగానే ఎక్కువమందికి ఝాన్సీ లక్ష్మీబాయి పేరే గుర్తుకొస్తుంది. కానీ ఆమెతో పాటు అనేక మంది మహిళలు... ధైర్యంగా ఆనాటి యుద్ధంలో పాల్గొన్నారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు కోల్పోయారు. వారిలో అంతగా చరిత్ర పుటలకెక్కని వీరవనిత ఊదాదేవి. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా మహిళా దళాన్ని తయారు చేసి... 32 మంది తెల్లవారిని ఒంటిచేత్తో మట్టుబెట్టిన ఈ దళిత వీరాంగన సాహసం వింటే ఇప్పటికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి.

  • IPL 2022 opening combinations: ఏ జట్లకు ఎవరెవరున్నారంటే?

ఐపీఎల్​ మెగావేలం ప్రక్రియ పూర్తైంది. ఇక తుది జట్లలోకి ఎవరిని తీసుకోవాలనే విషయమై కసరత్తులు చేయాలి. ఈ నేపథ్యంలో ఆయా జట్లలో ఓపెనర్లుగా ఎవరున్నారు? బలమైన ఓపెనింగ్​ జోడీ ఏది? లేని టీమ్​లకు ఎలాంటి కాంబినేషన్​ను ప్రయత్నిస్తే బాగుంటుందో చూద్దాం...

ABOUT THE AUTHOR

...view details