ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలురేపు తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం రేపు జరగనుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల దృష్ట్యా ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీకానున్నారు.డ్రగ్స్ కేసులో టోనీని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు డ్రగ్స్ కేసులో టోనీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్‌గూడ జైలు నుంచి పంజాగుట్ట పీఎస్‌కు తరలించారు.'ప్రజల ప్రగతే ధ్యేయంగా ముందుకెళ్తున్నాం' రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. ఇవాళ రంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గత కొన్నిరోజులుగా మంత్రి.. రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టించే పనుల ప్రారంభోత్సవాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని కేటీఆర్ చెబుతున్నారు.'సంక్షేమానికి చిరునామా తెలంగాణ సర్కార్' రాష్ట్రంలో పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా కొత్తగా ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన మంత్రి.. నారాయణపురంలో 250 పడకల ఆస్పత్రి, సత్తుపల్లి 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు.క్షమాపణలు చెప్పిన సోమువీర్రాజు భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. కడప జిల్లాకు సంబంధించి తాను వాడిన పదాలు సీమ ప్రజల మనసులను గాయపరిచాయని.. అభివృద్ధి విషయంలో ప్రభుత్వ తీరును తప్పుబడుతూ అలా అన్నానని స్పష్టం చేశారు.ప్రియుడితో భార్య పరార్.. అతని భార్య ప్రియుడితో వెళ్లిపోయింది. తిరిగిరావాలని ప్రాధేయపడినా నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన భర్త.. ఆమె ప్రియున్ని హత్య చేశాడు. ఈ ఘటన మహారాష్ట్ర, పాల్ఘర్ జిల్లాలో జరిగింది.రైల్లో చెలరేగిన మంటలు.. గాంధీధామ్- పూరీ ఎక్స్‌ప్రెస్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నందుర్బార్ రైల్వే స్టేషన్‌కి రాగానే బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.రుణ యాప్‌ల కేసులో 13 డొల్ల కంపెనీలు చైనా రుణయాప్‌లు, పెట్టుబడుల కేసులో 13 డొల్ల కంపెనీలున్నట్లు గుర్తించారు. ఈ మేరకు ఆయా సంస్థలపై రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ హైదరాబాద్ సీసీఎస్ (Hyderabad cyber crime station)లో ఫిర్యాదు చేసింది. నకిలీ ధ్రువపత్రాలు, ఫోర్జరీ సంతకాలతో ఈ కంపెనీలు కొనసాగుతున్నాయని పేర్కొంది.స్టార్క్‌కు అత్యున్నత పురస్కారం 2021-22 ఏడాదికి గానూ ఉత్తమ క్రికెట్లరకు తమ దేశ క్రికెట్లోని అత్యుత్తమ పురస్కారాలను ప్రకటించింది ఆస్ట్రేలియా బోర్డు. మిచెల్ స్టార్క్, గార్డ్నర్(ashleigh gardner) సహా పలువురు అవార్డులను అందుకున్నారు. వారెవరు? ఏ పురస్కారాలను అందుకున్నారంటే?క్వారంటైన్ వల్ల అమ్మను కలవలేకపోతున్నా: చిరంజీవి తల్లి అంజనాదేవీకి బర్త్‌డే విషెస్ చెప్పిన చిరంజీవి.. క్వారంటైన్ వల్ల ఆమెను కలవలేకపోతున్నామని ట్వీట్ చేశారు. మరు జన్మలకు ఆమె దీవెనలు కావాలని కోరుకుంటున్నానని రాసుకొచ్చారు.