ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలువిద్యాసంస్థలు తెరిచేందుకే సర్కార్ మొగ్గు ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలు తెరిచే అవకాశం ఉంది. ఈ విషయంపై తన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అధికారకంగా ప్రకటించనుంది. విద్యాసంస్థలు తెరిచాక.. కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.దేశంలో తగ్గిన కేసులు.. భారత్‌లో కొవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం మరో 2,35,532మందికి కొవిడ్ వైరస్ సోకింది. ఒక్కరోజులో 871 మంది మరణించారు. 3,35,939 మంది కొవిడ్‌ను జయించారు. దేశంలో పాజిటివిటీ రేటు 13.39 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.'భాజపా హామీలన్నీ అబద్ధాలే..' ఉత్తర్‌ప్రదేశ్ గత ఎన్నికల సందర్భంగా భాజపా ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలేనని తేలాయని సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ఈసారి భాజపాకు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. అధికారంలోకి వస్తే చేపట్టనున్న కార్యక్రమాల గురించి వివరించారు.సామాన్యులకు కొత్త గూడు కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1న రాబోతుంది. ఆర్థిక మంత్రి, తెలుగింటి కోడలు నిర్మలమ్మ పద్దు నుంచి గృహ కొనుగోలుదారులు ఏం ఆశిస్తున్నారు? స్థిరాస్తి వర్గాలు ఎలాంటి అంచనాలు పెట్టుకున్నాయి?.'దళితుల' కటాక్షం దక్కేదెవరికి? పంజాబ్‌లో దళితులు ఏ పార్టీవైపు మొగ్గుచూపనున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ఏ ఒక్క పార్టీకో వీరు ఓటు బ్యాంకుగా లేరు. దీంతో రాష్ట్రంలో దాదాపు 32 శాతంగా ఉన్న దళితులను ఆకట్టుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. మరి వారి కటాక్షం ఎవరికి దక్కుతుందో?తొమ్మిది నెలల కింద మృతి.. ఇప్పుడు సెకండ్ డోసు టీకా! తొమ్మిది నెలల కింద మృతి చెందిన వ్యక్తి... ఇప్పుడు సెకండ్ డోసు టీకా తీసుకున్నట్లు మెసేజ్ వచ్చింది. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు.. కోవిన్ పోర్టల్ నుంచి ధ్రువపత్రం డౌన్ లోడ్ చేశారు. ఈ సంఘటనపై కుటుంబ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.కాలేజీ ఫీజు చెల్లిస్తేనే పరీక్షకు పంపేది కరోనా మహమ్మారి, లాక్డౌన్ వల్ల గత రెండేళ్లుగా విద్యాసంస్థలు తెరుచుకుంటున్నాయి.. మూసుకుంటున్నాయి. విద్యార్థులంతా ఇళ్లకే పరిమితమై ఆన్లైన్ తరగతులకు హాజరవుతున్నారు. ఆన్లైన్ క్లాసులు వింటూనే.. పరీక్షలు రాస్తున్నారు. కానీ చాలా ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఫీజుల విషయంలో విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నాయి.పర్వతగిరిలో విషాదం.. వరంగల్ జిల్లాలో 8 నెమళ్లు మృత్యువాత పడ్డాయి. పర్వతగిరి మండల శివారు దేవిలాల్ తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పంటలకు పిచికారీ చేసిన క్రిమిసంహారక మందుల వల్లే నెమళ్లు మరణించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.'ఆ రూల్స్ ఉంటే సచిన్ లక్షకుపైగా రన్స్ చేసేవాడు' క్రికెట్లో ప్రస్తుతం ఉన్న నిబంధనలు బ్యాటర్లకు అనుకూలంగా ఉన్నాయంటూ వస్తున్న వాదనలకు మద్దతు పలికాడు పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్. ఈ రూల్స్ తాము ఆడే రోజుల్లో ఉండి ఉంటే భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ లక్షకు పైగా పరుగులు చేసేవాడని అభిప్రాయపడ్డాడు.హీరో విజయ్‌కు హైకోర్టులో ఊరట డబ్బింగ్ సినిమాలతో తెలుగువారికి సుపరిచితమైన స్టార్ హీరో విజయ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. పన్ను ఎగవేత కేసులో అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర స్టే జారీ చేసింది.