ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం మనది: గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అత్యుత్తమ రాజ్యాంగం అందించిన దార్శనికులకు నివాళులర్పించారు. వ్యాక్సినేషన్‌లో ప్రపంచంలోనే ముందున్నందుకు గర్వంగా ఉందని అన్నారు.తెలుగు రాష్ట్రాల్లో.. ఆరుగురుని వరించిన పద్మాలు 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాదికి గానూ 128 మందిని పద్మ పురస్కారాలకు ఎంపిక చేశారు. వీరిలో తెలుగు రాష్ట్రాలలో.. పలు రంగాల్లో సేవలందిస్తున్న ఆరుగురికి పద్మ పురస్కారాలు వరించాయి.భారతావని ఉదయించిన వేళ.. భారత స్వాతంత్య్ర దినోత్సవం ఎప్పుడంటే 1947 ఆగస్టు 15.. అని చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు. అది నిజమే అయినా.. ఆనాటితో మనపై బ్రిటన్ రాజరికమేమీ తొలగిపోలేదు. ఆ తర్వాతా బ్రిటిష్ గొడుగుకిందే ఉన్నాం! 1950 జనవరి 26న భారత ప్రజలకు సంపూర్ణ రాజకీయ స్వాతంత్య్రం లభించింది. బ్రిటిష్ రాచరికపు సంకెళ్లను తెంచుకొని భారతావని ప్రజాతంత్రంగా ఉదయించింది.మార్చిలో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు! రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను మార్చిలో నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సాధారణంగా కేంద్ర బడ్జెట్ అనంతరం రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.దేవభూమిలోపంచ రణక్షేత్రాలు.. గెలిచేదెవరో? ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం అధికార భాజపా, ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అన్ని స్థానాల్లోనూ పోటీ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ప్రధానంగా ఐదు నియోజకవర్గాలు మాత్రం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.ప్రయాణికులకు శుభవార్త.. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారికి కృష్ణాజిల్లా ఆర్టీసీ అధికారులు శుభవార్త చెప్పారు. కృష్ణా జిల్లా - హైదరాబాద్ మధ్య ప్రయాణించే ఇంద్ర, అమరావతి, గరుడ, నైట్ రైడర్, వెన్నెల స్లీపర్ బస్సుల్లో 20 శాతం వరకు ఛార్జీలు తగ్గిస్తామని అధికారులు ప్రకటించారు.ఎల్‌ఐసీ లాభం రూ.1,437 కోట్లు భారత జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీ లాభాలను గడించింది. తొలి ఆరు నెలల కాలానికి రూ.1,437 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో మారుతీ సుజుకీ సంస్థ లాభం 48 శాతం తగ్గింది.ఫోన్‌కు మరీ అంతలా అతుక్కుపోతున్నారా? ఫోన్ మీ గుప్పిట ఉందా? మీరు ఫోన్ గుప్పిట్లో ఉన్నారా? సమాధానం చెప్పటం కష్టమే. మన నుంచి మనల్ని ఫోన్ అంత స్మార్ట్‌గా లాగేసుకుంది మరి. ఒక్క క్షణమైనా విడవలేనంతగా పట్టేసుకుంది. దీనికి మరీ ఇంతలా అతుక్కుపోతే ఎలా? కాసేపైనా దీని హస్తాల్లోంచి బయటపడకపోతే 'టెక్ శాంతి'ని దూరం చేసుకున్నట్టే.Aus vs Pak: 24 ఏళ్ల తర్వాత పాక్ పర్యటనకు ఆస్ట్రేలియా దాదాపు 24 ఏళ్ల తర్వాత పాక్ పర్యటనకు సిద్ధమవుతోంది ఆస్ట్రేలియా. ప్రస్తుతం ఇరుదేశాల బోర్డుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. త్వరలో దీనిపై ప్రకటన వచ్చే అవకాశముంది.నటనలో 'షావుకారు'.. సాయంలో 'చిలకమ్మా మజాకా' సినిమా పేరును ఇంటి పేరుగా మార్చుకున్న నటులు ఎంతోమందే. తొలిసారి అలా ఓ సినిమా పేరు ఇంటి పేరుగా మారిపోవడం 'షావుకారు' జానకితోనే మొదలైంది. 400కి పైగా చిత్రాల్లో హీరోయిన్గా, క్యారెక్టర్ నటిగా గుర్తుండిపోయే పాత్రల్లో ఒదిగిపోయిన ఆమె.. ఇప్పుడు పద్మశ్రీ షావుకారు జానకి. రేడియో, నాట్య కళాకారిణిగా, నటిగా కళారంగానికి చేసిన సేవలకుగానూ తమిళనాడు ప్రభుత్వం నుంచి ఆమె పద్మ పురస్కారానికి ఎంపికయ్యారు.