తెలంగాణ

telangana

By

Published : Jan 19, 2022, 12:59 PM IST

ETV Bharat / city

TOP NEWS TODAY : టాప్​టెన్​ న్యూస్​ @1PM

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

TOP NEWS TODAY, telangana news
తెలంగాణ టాప్​టెన్​ న్యూస్

  • మంత్రుల పర్యటనలో కరోనా కలకలం..

మంత్రి నిరంజన్ రెడ్డి ఉమ్మడి వరంగల్​ పర్యటనలో కరోనా కలకలం రేపుతోంది. ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా సోకడంతో.. తెరాస నేతల్లో ఆందోళన మొదలైంది. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దంపతులకు కరోనా సోకింది. రాత్రి జ్వరం రావడంతో.. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, ఆయన భార్య వరంగల్ జడ్పీ ఛైర్​పర్సన్ జ్యోతి.. కొవిడ్​ పరీక్షలు చేయించుకున్నారు. దీనిలో ఇద్దరికీ కరోనా సోకినట్లు ఫలితాలు వచ్చాయి.

  • 'వైద్యారోగ్య శాఖకు అధిక ప్రాధాన్యత'

వైద్య, ఆరోగ్య శాఖకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తోందని మంత్రి కేటీఆర్​ వెల్లడించారు. గతంలో దయనీయంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల ఫోటోలను, ప్రస్తుతం ప్రభుత్వం నిర్మించిన ఆస్పత్రులను జత చేసి... మంత్రి హరీశ్​ రావుకు అభినందనలు తెలియజేశారు.

  • ఏపీ సీఎస్​కు 'సుప్రీం' సమన్లు

కరోనా పరిహారం చెల్లించడంలో ఆలస్యంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు సమన్లు జారీ చేసింది. మధ్యాహ్నం 2 గంటలకు తమ ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది.

  • బస్సులో చెలరేగిన మంటలు..

గుజరాత్​లోని సూరత్​లో ఘోరం జరిగింది. నగరంలోని వరచా ప్రాంతంలో ఓ ప్రైవేట్​ బస్​లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ మహిళ సజీవ దహనం అయ్యింది.

  • సమాజ్​వాదీకి షాక్​..

సమాజ్​వాదీ అగ్రనేత ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్.. భాజపాలో చేరారు. గతకొద్దిరోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ.. ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.

  • మంత్రివర్గ సమావేశంలో అనుకోని అతిథులు..

రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి అనుకోని అతిథులు హాజరయ్యారు. సోమవారం జరిగిన సుధీర్ఘ కేబినెట్ భేటీకి కొందరు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా హాజరవడం విశేషం. ధరణి పోర్టల్ సమస్యలు, రాజకీయ అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ వారి అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని పలువురు మంత్రులు, నేతలు సీఎం కేసీఆర్​ను కోరినట్లు సమాచారం.

  • బాలికపై అత్యాచారం.. ఎన్​కౌంటర్​లో హతం!

ఎనిమిదేళ్ల బాలికను అపహరించి, అత్యాచారానికి పాల్పడ్డ ఓ వ్యక్తిని పోలీసులు కాల్చి చంపేశారు. ఆడుకోవడానికి బయటకు వెళ్లిన బాలికను.. నిందితుడు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

  • ఆ మహిళ అదిరే ఫీట్​

అరబ్‌ నగరం దుబాయ్‌కే మకుటాయమాణంగా నిలుస్తున్న బుర్జ్​ ఖలీఫాపై ఆ మహిళ మరోసారి ప్రత్యక్షమైంది. ఒళ్లు గగుర్పొడిచే రీతిలో 830 మీటర్ల ఎత్తున నిలబడి తానిక్కడే ఉన్నానంటూ పలకరించింది. ఫ్లైఎమిరేట్స్‌ విమానం ప్రమోషన్ కోసం ఆగస్టులో తొలిసారి బుర్జ్ ఖలీఫా శిఖరంపై నిల్చున్న నికోల్ స్మిత్ మళ్లీ అక్కడే ప్రత్యక్షమై దుబాయ్ ఎక్స్‌పో రారండోయ్‌ అంటూ వినూత్నంగా ఆహ్వానం పలికింది.

  • 'కోహ్లీ ముందు ఊరిస్తున్న రికార్డులు'

టీమ్​ఇండియా మాజీ సారథి విరాట్​ కోహ్లీ సెంచరీ నమోదు చేసి దాదాపు రెండేళ్లయింది. ఈ నేపథ్యంలో కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేశాడు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు మోర్నీ మోర్కెల్. సౌతాఫ్రికాతో సిరీస్​లో విరాట్​ పక్కా సెంచరీ చేస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. మరోవైపు వన్డేల్లో మరో 22 పరుగులు చేస్తే కోహ్లీ అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్నాడు.

  • 'నాలుగు గంటలు నిలబడ్డా.. వెళ్లిపోమన్నారు!'

ఆలీతో సరదాగా' తాజా ఎపిసోడ్​లో హీరోయిన్ కృతిశెట్టి, దర్శకుడు కల్యాణ్​కృష్ణ సందడి చేశారు. పలు సరదా సంగతుల్ని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details