ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలుగండ్ర దంపతులకు కరోనా.. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దంపతులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఆయన మంత్రులతో కలిసి నిన్న పంట నష్టం పరిశీలించారు. కాసులు కురిపించిన సంక్రాంతి సంక్రాంతి పండుగ టోల్‌ప్లాజాలకు కాసులు కురిపించింది. రాష్ట్రం నుంచి జనం భారీగా ఇతర రాష్ట్రాలకు వెళ్లడంతో దండిగా ఆదాయం సమకూరింది. రాష్ట్రంలో ఆయా జాతీయ రహదారులపై 28 టోల్‌ప్లాజాలు ఉన్నాయి. పండుగ మూడు రోజుల్లో టోల్గేట్ల వద్ద 7.55 లక్షలు వసూలు అయ్యాయి.శశాంక్ గోయల్ బదిలీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ బదిలీ అయ్యారు. కేంద్ర కార్మికశాఖ అదనపు కార్యదర్శిగా శశాంక్ గోయల్ నియమితులయ్యారు. శశాంక్ గోయల్‌ను కేంద్ర సర్వీసులకు బదిలీ చేస్తూ... సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.శెభాష్ పోలీస్.. ఖాకీ దుస్తుల చాటున కరకుదనమే కాదు.. మానవత్వమూ ఉంటుందని చాటారు వరంగల్ జిల్లా రాయపర్తి సబ్‌ఇన్‌స్పెక్టర్ బండారి రాజు.. స్పృహ లేకుండా పడివున్న ఓ గుర్తుతెలియని వృద్ధుడి గురించి సమాచారం అందిన వెంటనే స్పందించి... ఆయనను భుజాలపై కిలోమీటరు దూరం మోసుకొచ్చి ప్రాణాలు నిలిపారు.పెళ్లి గూగుల్ మీట్లో.. విందు జొమాటోలో! పెళ్లంటే.. ఆకాశమంత పందిళ్లు.. చుట్టాల సందళ్లు.. విందు భోజనాలు..! ఇదంతా రెండేళ్ల క్రితం వరకు ఉన్న మాట. కరోనా పుణ్యమాని ఇప్పుడు పెళ్లిళ్లలో నయా ట్రెండ్ మొదలైంది. అదే 'ఆన్‌లైన్ వెడ్డింగ్'. మహమ్మారి భయాందోళనలు, కరోనా ఆంక్షల నేపథ్యంలో గతేడాది కొంత మంది వధూవరులు జూమ్ కాల్‌లోనే పెళ్లిపీటలెక్కడం లేదా.. తమ పెళ్లిని ఆన్‌లైన్ లైవ్‌లో ప్రసారం చేయడం వంటివి చేశారు. 'నాలుగో డోసు పొందినా.. పాక్షికమే' టీకా డోసుల సంఖ్య పెరిగిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నుంచి రక్షణ అంతంత మాత్రంగానే ఉందని ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు తెలిపారు. కొంతమందికి నాలుగో టీకా ఇచ్చి పరీక్షించారు. అయితే వారిలో యాంటీ బాడీల సంఖ్య తక్కువగా పెరిగినట్లు గుర్తించారు. దీంతో ఒమిక్రాన్‌ను ఎదుర్కొనే శక్తి నాలుగో డోసు తరువాత కూడా అంతంత మాత్రమే అని అంటున్నారు.కొవిడ్ ఉగ్రరూపం దేశంలో కొవిడ్-19 వ్యాప్తి మూడు వారాల్లోనే గరిష్ఠ స్థాయికి చేరుతుందని 'ఎస్‌బీఐ రీసెర్చ్' తాజాగా అంచనా వేసింది. అయితే ఈ తీవ్రత ఎక్కువ కాలం ఉండకపోవచ్చని పేర్కొంది.అత్యంత వృద్ధుడి కన్నుమూత.. ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా భావిస్తున్న డెలా ఫ్యుయెంటె అనే వ్యక్తి మరణించారు. స్పానిష్ ఫ్లూ వంటి మహమ్మారులను ఎదుర్కొని నిలిచిన ఆయన.. మంగళవారం ప్రాణాలు కోల్పోయారు. ఆయన వయసెంతంటే?ధోనీ గ్యారేజ్‌లో కొత్త కారు.. టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ గ్యారేజ్‌లో కొత్త కారు చేరింది. మరి ఆ కారు ప్రత్యేకతలేంటో ఓసారి చూసేద్దాం.ప్రాణమంతా 'పాన్ ఇండియా' పాన్ ఇండియా సినిమాలు.. ఈ మధ్య కాలంలో తెలుగులో ఎక్కువవుతున్నాయి. మన వాళ్లనే కాకుండా దేశవ్యాప్తంగా ఆడియెన్స్‌ను అలరించాలని టాలీవుడ్ హీరోలు భావిస్తున్నారు. ఇంతకీ ఆ కథానాయకులు ఎవరు? ఏయే సినిమాలు చేస్తున్నారు?