తెలంగాణ

telangana

ETV Bharat / city

Top News Today : టాప్​టెన్​ న్యూస్​ @7AM - తెలంగాణ వార్తలు

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

Top News Today, telangana news
టాప్​టెన్​ న్యూస్

By

Published : Jan 19, 2022, 7:02 AM IST

  • చెట్టు కూలి ఇద్దరు చిన్నారులు మృతి

ఖమ్మం జిల్లాకేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. ఆనందంగా క్రికెట్ ఆడుకుంటున్న చిన్నారులను ఓ చెట్టు చిదిమేసింది. గోడపై ఉన్న భారీ వృక్షం కూలిపోవడంతో ఇద్దరు బాలురు మృతి చెందగా నలుగురు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

  • అప్పుడు తెగుళ్లు.. ఇప్పుడు వడగండ్లు..

అప్పుడు తెగుళ్లు.. ఇప్పుడు వడగండ్లతో మిరపరైతు కుదేలు అవుతున్నాడు. ఎకరా సాగు ఖర్చు రూ.లక్ష పైనే కావడంతో మిరప రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. కీలకమైన వాణిజ్యపంటకు సర్కారు చేయూతనివ్వకపోవడం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో వారు తీవ్రంగా నష్టపోయారు.

  • ఆన్‌లైన్‌ తరగతులతో కళ్లపై ఒత్తిడి..

ఆన్​లైన్ క్లాసులు విద్యార్థుల కళ్లపై తీవ్ర ప్రభావం చూపుతాయని కంటి వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ‘‘బడులు మూతపడటంతో విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను చేతపట్టుకున్నారు. ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు కొనిచ్చే స్థోమత లేని ఎక్కువ మంది సెల్‌ఫోన్‌లనే పిల్లలకు అందుబాటులోకి తెచ్చారు.

  • '5జీ టెక్నాలజీతో విప్లవాత్మక మార్పులు..'

5జీ టెక్నాలజీతో జీవన విధానంలో విప్లవాత్మక మార్పులతో.. కీలక రంగాలన్నిటిపైనా ప్రభావం చూపిస్తుందని టెలికమ్యూనికేషన్ నిపుణురాలు కల్యాణి బోగినేని తెలిపారు. కొత్త టెక్నాలజీలతో నాలుగో పారిశ్రామిక విప్లవం వస్తుందని.. కర్మాగారాల స్వరూపం మారిపోయి రోబోల వినియోగం పెరుగుతుందని వెల్లడించారు. త్వరలోనే రోబోటిక్స్‌, సెన్సర్లతో వ్యవసాయం మరింత కొత్తపుంతలు తొక్కనుందని పేర్కొన్నారు.

  • ప్రభుత్వాస్పత్రుల్లో పెరుగుతున్న సంఖ్య..

ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం అంటే కంగారు పడే రోజులు మారాయి.ప్రస్తుతం ప్రైవేట్‌ ఆసుపత్రుల కంటే సర్కార్‌దవాఖానాలకు ప్రసూతి కోసం వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు సర్కార్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంటుండటంతో ప్రభుత్వాసుపత్రులకు వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచన మేరకు సాధారణ ప్రసవాల వల్ల కలిగే ప్రయోజనాలు వివరిస్తూ మరింత పెంచే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

  • దేశంలో ఆకలి చావులు లేవంటారా?

దేశంలో ఆకలి చావులు లేవంటారా? అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్వీ రమణ ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా సామాజిక వంటశాలల పథకాన్ని అమలు చేయడంపై నియమావళి రూపొందించాలని ఆదేశించారు.

  • ఓటరు మౌనం.. పార్టీల్లో ఉత్కంఠ!

ఉత్తరాఖండ్‌లో ఈ దఫా ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌, భాజపాల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఇరు పార్టీలకు చెందిన అగ్రనేతలు తమ ఘనతలను చాటుకొంటూనే, ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రచారాల్లో పాల్గొని ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

  • భార్య, ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య..

భార్య, ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు ఓ వ్యక్తి. ఈ విషాద ఘటన మహారాష్ట్రలో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

  • ముర్రే, సబలెంక శుభారంభం

గతేడాది యుఎస్‌ ఓపెన్‌తో గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల ఖాతా తెరిచిన రష్యా కుర్రాడు మెద్వెదెవ్‌.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లోనూ వేట మొదలెట్టాడు. టైటిల్‌ ఫేవరేట్లలో ఒకడైన ఈ 25 ఏళ్ల ప్రపంచ రెండో ర్యాంకు ఆటగాడు తొలి అడుగు వేశాడు. అయిదేళ్ల తర్వాత ఈ టోర్నీలో మాజీ నంబర్‌వన్‌ ముర్రే ఓ మ్యాచ్‌ గెలిచాడు.

  • 'ఘోస్ట్​'లో ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ

తెలుగులో పలు సినిమాలు చేసిన ముద్దుగుమ్మ సోనాల్ చౌహాన్.. మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. నాగ్ 'ఘోస్ట్' సినిమాలో ఈమె హీరోయిన్​గా ఎంపికైందని సమాచారం.

ABOUT THE AUTHOR

...view details