ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు'జీహెచ్ఎంసీలో విస్తరిస్తున్న ఒమిక్రాన్..' తెలంగాణలో కరోనా విలయ తాండవం చేస్తోంది. కొత్తగా 2,447 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా.. జీహెచ్ఎంసీ పరిధిలో ఒమిక్రాన్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో దాదాపు 92 శాతం కేసులు ఈ వేరియంట్‌వేనని నిర్ధారణ అవుతున్నాయి. కేబినెట్ కీలక నిర్ణయాలు.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధన చేయాలని కార్పొరేట్‌కు దీటుగా సర్కార్ బడులను తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని తీర్మానించింది. నిండాముంచిన అకాలవర్షాలు.. వానదేవుడే మాపంటను ఎత్తుకుపోయాడు. ఇక మా గోస తీరేదెట్లా అని విలపిస్తున్న రైతు బాధవర్ణనాతీతం. అకాల వర్షాలు ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులకు కడగండ్లను మిగిల్చాయి. నర్సంపేట, పరకాల ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ ముందు కురిసిన రాళ్లవానకు మిర్చి, మెుక్కజొన్న, పత్తి పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది.అప్పుల బాధతో మిర్చి రైతు ఆత్మహత్య వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధతో పురుగుల మందు తాగి మిర్చి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 15 న మిరప తోటలో పురుగుల మందు తాగిన మహేందర్ చికిత్స పొందుతూ 16 వతేదీ మృచి చెందాడు.సాగరతీరంలో ప్రపంచ ఫార్ములా ఈ- రేస్.. వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఫార్ములా-ఈ స్పోర్ట్ నిర్వహణకు హైదరాబాద్ వేదిక కానుంది. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్, రాష్ట్ర ప్రభుత్వం, గ్రీన్ కో గ్రూపు సంయుక్తంగా హైదరాబాద్‌లో ఈ రేస్ నిర్వహణకు బీజంవేశాయి. 2.37 కిలోమీటర్ల రేసింగ్ ట్రాక్‌ను గుర్తించిన ఫార్ములా-ఈ నిర్వాహకులు ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వంతో లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను మార్చుకున్నారు.కళ తప్పిన యూపీ ఎన్నికలు.. దేశంలోని వివిధ రాష్ట్రాల ఎన్నికలతో పోలిస్తే.. ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు ఎంతో ప్రముఖమైనవి. అక్కడ తలలు పండిన రాజకీయ నేతలు వేసే వ్యూహా- ప్రతి వ్యూహాలు, ప్రత్యర్థుల ఊహాకందని ఎత్తుగడలు.. రాజకీయ విశ్లేషకులనే ఆశ్చర్యానికి గురి చేస్తాయి. రోడ్లపై దూసుకెళ్తున్న వాహనాలు.. కిక్కిరిసిన రోడ్లు.. గంటల కొద్దీ ట్రాఫిక్ జాంలు రణగొణధ్వనులతో నిత్యం పడుతూలేస్తూ ప్రయాణిస్తున్న మెట్రోనగరాల్లో హైదరాబాద్ భిన్నంగా నిలిచింది. రాజధాని రహదారులపై సగటు వేగం గంటకు 25 కిలోమీటర్లకు పెరిగనట్లు స్పీడ్‌సర్వేలో తేలింది. ఆయా నగరాల్లో రహదారుల విస్తీర్ణం, వాహనాల సాంద్రత, మౌలిక సదుపాయాల ఆధారంగా వాహనాల సగటు వేగాన్ని లెక్కగట్టాయి.మహిళను పట్టాలపైకి తోసేసిన యువకుడు.. ప్లాట్‌ఫాంపై ఉన్న మహిళను కదులుతున్న రైలు ముందుకి తోసేశాడు ఓ దుండగుడు. ఈ షాకింగ్ ఘటన బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో జరిగింది.రూట్ బాటలో స్టోక్స్.. గతేడాది గాయం కారణంగా ఐపీఎల్ మధ్యలోనే వైదొలిగిన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ ఈ సీజన్‌కు కూడా అందుబాటులో ఉండట్లేదని తెలిసింది. ఇటీవలే జరిగిన యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియాపై ఘోరంగా ఓడిపోయింది ఇంగ్లీష్ జట్టు. ఈ నేపథ్యంలో జట్టుకు అండగా ఉండేందుకు స్టోక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.హీరో ధనుష్, ఐశ్వర్య దంపతుల విడాకులు తమిళ నటుడు ధనుష్, ఐశ్వర్య దంపతులు విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.