తెలంగాణ

telangana

ETV Bharat / city

TOP NEWS TODAY : టాప్​టెన్​ న్యూస్​ @7AM

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

TOP NEWS TODAY,  telangana top news
తెలుగు టాప్​టెన్​ న్యూస్​

By

Published : Jan 26, 2022, 7:00 AM IST

  • ఏపీలో ఇక 26 జిల్లాలు..

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేయాలని నిర్ణయించారు. కొత్త జిల్లాలు, జిల్లా కేంద్రాలతో నోటిఫికేషన్‌ విడుదల చేశారు. వచ్చే ఉగాది నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

  • కరోనా సోకిందని కాన్పు చేయని వైద్యులు..

నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో విధి నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహించిన డ్యూటీ డాక్టర్​పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. కొవిడ్ పాజిటివ్ సోకిన మహిళకు ప్రసవం చేయడానికి నిరాకరించిన డాక్టర్‌పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పురిటినొప్పులతో వచ్చిన మహిళలకు కొవిడ్ పాజిటివ్‌ ఉన్నా సరే కచ్చితంగా ప్రసవం చేయాల్సిందేనని వైద్యులను ఆదేశించారు.

  • నూటికి నూరు శాతం టీకాస్త్రం..

వ్యాక్సినేషన్‌లో కరీంనగర్‌ జిల్లా రికార్డు సృష్టించింది. మంగళవారం నాటికి జిల్లాలో రెండో డోస్‌ పంపిణీ 100 శాతం పూర్తయింది. తద్వారా రాష్ట్రంలో రెండు డోసులు 100 శాతం పూర్తి చేసుకున్న తొలిజిల్లాగా, దక్షిణాది రాష్ట్రాల్లో రెండో జిల్లాగా రికార్డు సొంతం చేసుకుంది.

  • అంచనాలకు మించి వాణిజ్య పన్నుల రాబడి

రాష్ట్రంలో వాణిజ్య పన్నుల ఆదాయం భారీగా వచ్చింది. అంతకు ముందు ఏడాది 10 నెలల్లో వచ్చిన రాబడుల కంటే 30శాతం వృద్ధి నమోదు చేసింది. గత ఆర్థిక ఏడాదిలో వచ్చిన మొత్తం రాబడికి మించి ఈ పది నెలల్లో ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 65వేల కోట్లుకు చేరువయ్యే అవకాశం ఉన్నట్లు వాణిజ్య పన్నుల శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

  • ఏపీలోని నూతన జిల్లాల స్వరూపం ఇదే

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు ఆ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నూతన జిల్లాల జనాభా, వైశాల్యం, నియోజకవర్గాలు,రెవెన్యూ డివిజన్లు మీకోసం..!

  • 'యూపీ ప్రజల ఆకాంక్ష వేరు'

ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ. విభజన రాజకీయాలు భాజపా, ఎస్పీలకు మాత్రమే నప్పుతాయని అన్నారు.

  • గణతంత్ర వేడుకలకు యావత్​ భారతావని సిద్ధం

73వ గణతంత్ర వేడుకలకు యావత్​ భారతావని సిద్ధమైంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గౌరవ వందనంతో రాజ్​పథ్​ వద్ద రిపబ్లిక్​ డే పరేడ్ ప్రారంభం కానుంది.

  • 384 మందికి గ్యాలంటరీ అవార్డులు..

గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్యాలంటరీ అవార్డులను ప్రకటించింది రక్షణశాఖ. మొత్తంగా 384 మందికి శౌర్య పురస్కారాలు, ఇతర అవార్డులు ప్రతిపాదించగా రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.

  • తండ్రయిన భారత క్రికెటర్ యువరాజ్ సింగ్

మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రయ్యాడు. ఈ విషయాన్ని మంగళవారం రాత్రి వెల్లడించాడు. భారత జట్టుకు దాదాపు 19 ఏళ్ల పాటు ఇతడు ఆడాడు.

  • ప్రేమికుల రోజున 'సర్కారు వారి పాట' సందడి

మహేశ్​ 'సర్కారు వారి పాట' సినిమాలోని తొలి గీతం వాలంటైన్స్​ డే రోజు విడుదల కానుంది. ఈ సినిమా ఏప్రిల్​లో థియేటర్లలోకి రానుంది.

ABOUT THE AUTHOR

...view details