1. రాష్ట్రంలో యూకే వైరస్ కలకలం
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కలిగిస్తున్న యూకే వైరస్ కలకలం రాష్ట్రంలోనూ మొదలైంది. కొత్తగా మార్పుచెందిన ఈ వైరస్‌కు సంబంధించి తొలికేసు నమోదైనట్లు తెలుస్తోంది. వరంగల్ నగర జిల్లాకు చెందిన 49ఏళ్ల వ్యక్తిలో వైరస్ ఉన్నట్లు గుర్తించిన సీసీఎంబీ... కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
2. ఆ 156 మంది ఎక్కడ?
రాష్ట్రానికి వచ్చిన యూకే ప్రయాణికుల ఆచూకీపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఈనెల 9 నుంచి ఇప్పటి వరకూ రాష్ట్రానికి వచ్చిన 1,216 మంది యూకే నుంచి వచ్చారు. ఆ ప్రయాణికుల్లో 156 మంది ఆచూకీ లభ్యం కాలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
3. వైరస్‌కు రక్త ఇన్ఫెక్షన్లు తోడైతే ..
కొవిడ్-19 లక్షణాలతో పాటు రక్త ఇన్ఫెక్షన్లు తోడైతే పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంటుందని రట్జర్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. 375 మంది రోగులపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు... కొవిడ్‌తో పాటు రక్త ఇన్ఫెక్షన్ ఉన్న రోగుల్లో మరణాలు 50శాతానికి మించి ఉన్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
4. ఆన్లైన్ డెత్
చిన్నప్పటి నుంచి చదువులో రాణించాడు. ఉన్నత విద్యలో ప్రత్యేక కోర్సులు భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాల్సిన సమయంలోనే ఆన్లైన్లో రమ్మీ ఆడుతూ అప్పులపాలై ఓ యువకుడు బలవన్మరణం పొందిన విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
5. మరో పోరుకురంగం సిద్ధం
గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు సహా మిగతా మున్సిపాలిటీల ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. ఎన్నికల ముందస్తు ప్రక్రియలో భాగంగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్లు ఖరారు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి లేఖ రాసింది. కొత్త ఓటర్ల జాబితా ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి