1. హైకోర్టు ఆమోదం
అగ్రిగోల్డ్ కేసులో ఆంధ్రాబ్యాంకు వేలం వేసిన రెండు ఆస్తుల రిజిస్ట్రేషన్లకు హైకోర్టు ఆమోదం తెలిపింది. హైదరాబాద్‌లో ఆంధ్రాబ్యాంకు రెండు ఆస్తులను వేలం వేసింది. వేలంలో దక్కించుకున్న వారికి ఆస్తులు రిజిస్ట్రేషన్లు చేయాలని ఉన్నతన్యాయస్థానం ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. విభజనకు నిర్ణయం
అత్యంత సులువైన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కోసమే సీఎం కేసీఆర్ మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారని రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నాలుగు రకాలుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ విభజనకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ప్లై ఓవర్ కింద అగ్నిప్రమాదం
హైదరాబాద్‌లోని బాలానగర్ ఫ్లై ఓవర్ నిర్మాణం వద్ద అగ్నిప్రమాదం చోటుచేసుకొంది. వెల్డింగ్ పనులు చేస్తుండగా.. నిప్పురవ్వలు థర్మాకోల్ షీట్‌పై పడి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. కరంటోళ్ల నిరాహార దీక్ష
హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద 'కరంటోళ్ల నిరాహార దీక్ష' పేరిట విద్యుత్ ఉద్యోగులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. జేఈఈ మెయిన్- షెడ్యూల్ విడుదల
జేఈఈ మెయిన్ షెడ్యూల్‌ను విడుదల చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. నాలుగు విడతల్లో జేఈఈ మెయిన్ నిర్వహించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు జేఈఈ మెయిన్ మొదటి పరీక్ష జరగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.