- నేడు సిరిసిల్లకు కేసీఆర్..
ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. గతంలో ఉరిసిల్లగా పేరొందిన సిరిసిల్ల ఇప్పుడు అభివృద్ధిలో అగ్రపథాన దూసుకెళుతోంది. మిగతా జిల్లాలను తోసిరాజని అపార మౌలిక వసతులతో ఆధునికతను సంతరించుకుంది. కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఇవాళ ప్రారంభించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- నీటి వాటా 50-50
కృష్ణా జలాల్లో 66, 34 నిష్పత్తిలో కేటాయింపులను తిరస్కరిస్తున్నామన్న రాష్ట్ర ప్రభుత్వం.. 811 టీఎంసీల్లో రెండు రాష్ట్రాలు ఈ ఏడాది నుంచి చెరిసగం వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. పోతిరెడ్డిపాడుతో పాటు రాయలసీమ ఎత్తిపోతల అక్రమ ప్రాజెక్టులేనని.. నికరంగా కేటాయింపులున్న ప్రాజెక్టులకు మాత్రమే కృష్ణా నీటిని వాడుకోవాలని ఆంధ్రప్రదేశ్‌కు స్పష్టం చేసింది. రైతుల సంక్షేమం కోసం ఎవరితోనైనా, ఎంతవరకైనా పోరాడతామని సీఎం తేల్చిచెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- భూగర్భ పార్కింగ్ నిషేధం..!
రాష్ట్రంలో భూగర్భ పార్కింగ్(Underground parking)ను ప్రభుత్వం నిషేధించింది. ఎకరా.. ఆపైన విస్తీర్ణంలో నిర్మించే భవనసముదాయాల్లో మొదటి ఐదు అంతస్థులు పార్కింగ్ కోసం వినియోగించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. భారీ వర్షాల సమయంలో సెల్లార్లలో నీరు చేరి ప్రమాదాలు చేసుకుంటున్నందున ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చినట్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- అతివేగం.. తీసింది ప్రాణం
అతివేగంగా వెళ్తున్న వ్యక్తి అకస్మాత్తుగా బ్రేక్ వేయడం వల్ల ద్విచక్రవాహనంపై ఉన్న ముగ్గురు యువకులు కిందపడ్డారు. అదే సమయంలో పక్కనే వచ్చిన రెడీమిక్స్ వాహనం.. వారి పై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటన(ACCIDENT)లో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- కొవిడ్ చికిత్సకు 200 ఔషధాలు!
కరోనా మహమ్మారికి సమర్థ చికిత్సలను అందుబాటులోకి తీసుకురావడానికి శాస్త్రవేత్తలు మరిన్ని ఔషధాల కోసం పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో.. కొవిడ్ చికిత్సకు పనికొచ్చే వీలున్న 200 ఔషధాలను గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- దీదీకి గండం తప్పదా?