- కాసుల వర్షం కురిపిస్తోన్న రిజిస్ట్రేషన్ శాఖ
TELANGANA STAMPS, REGISTRATION DEPT: రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం అనూహ్యంగా పెరుగుతోంది. ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఏటికేడు పెరుగుతూ వస్తున్న రాబడులు ఈ ఆర్థిక ఏడాదిలో ఇప్పటికే పదివేల కోట్లు దాటగా.... మార్చి చివరినాటికి మరో రెండున్నరవేల కోట్లు ఆదాయం వస్తుందని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అంచనా వేస్తోంది.
- రాష్ట్రానికి అండగా మేము.. దేశానికే దండగ మీరు!
KTR Tweet: తెరాస, భాజపా ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. ట్విట్టర్ వేదికగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పరస్పరం విమర్శలు కురిపించారు. రాష్ట్రంపై వివక్షను ప్రశ్నిస్తే సంబంధం లేని అంశాలను తెరపైకి తెస్తున్నారని కిషన్ రెడ్డిపై విరుచుకుపడిన కేటీఆర్... తాము రాష్ట్రానికి అండగా.. భాజపా దేశానికి దండగ అని వ్యాఖ్యానించారు.
- మహేశ్ బ్యాంకు హ్యాకింగ్ కేసులో పలువురు ఖాతాదారులు అరెస్ట్..
Mahesh Bank Hacking case: మహేశ్ బ్యాంకు సర్వర్ హ్యాకింగ్ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు పలువురు ఖాతాదారులను అరెస్ట్ చేశారు. పలువురి ఖాతాలకు సంబంధించిన వివరాలను సేకరించి నైజీరియన్లకు అందించటంలో కీలక పాత్ర పోషించిన నిందితున్ని పోలీసులు విచారిస్తున్నారు.
- యాదాద్రిలో కేసీఆర్ పర్యటన.. పునర్నిర్మాణ పనులపై దిశానిర్దేశం..
CM KCR Yadadri Visit : ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రిలో పర్యటించారు. హెలికాప్టర్‌లో యాదాద్రి చేరుకున్న సీఎం విహంగవీక్షణం చేశారు. పంచ నారసింహుల దివ్యాలయ ఉద్ఘాటన ఏర్పాట్లను పరిశీలించారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు, ఇతర నిర్మాణాల పురోగతిపై మంత్రులు, ఉన్నతాధికారులతో కేసీఆర్ సమీక్షించారు. మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ, మార్చి 21 నుంచి ప్రారంభం కానున్నా మహా సుదర్శన యాగం ఏర్పాట్లపై సమీక్షించారు.
- మణికొండ జాగీర్‌లో 1,654 ఎకరాలు ప్రభుత్వానివే: సుప్రీం
Manikonda Jagir Case: హైదరాబాద్ మహానగరం మణికొండ జాగీర్ 1654.32 ఎకరాల భూమి తెలంగాణ సర్కార్కే చెందుతుందని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో రాష్ట్ర సర్కారు చూపిన చొరవను ధర్మాసనం ప్రశంసించింది. తీర్పుపై సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తంచేశారు. అందుకు కృషిచేసిన న్యాయవాదులు, ప్రభుత్వ అధికారులకు అభినందనలు తెలిపారు.
- భార్య, కూతురికి సేవ చేయలేక విసిగి.. గొంతు కోసి..