- కాసేపట్లో మంత్రివర్గం భేటీ
కరోనా పరిస్థితులే ప్రధాన అజెండాగా కాసేపట్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. లాక్డౌన్ విషయమై తదుపరి నిర్ణయం తీసుకోనుంది. మూడో వేవ్ సన్నద్దతపైనా దృష్టి సారించనుంది. వానాకాలం పంటలు, సాగునీటి ప్రాజెక్టుల సంబంధిత అంశాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేబినెట్ చర్చించనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- హుజూరాబాద్‌లో ఈటల పర్యటన
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ పర్యటిస్తున్నారు. శుంభునిపల్లి నుంచి కమలాపూర్ వరకు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. కమలాపూర్, శంభునిపల్లి, కానిపర్తిలో రోడ్ షోగా వెళ్తుండగా.. అనుచరులు భారీగా చేరుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మోదీతో మహారాష్ట్ర సీఎం భేటీ
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మంగళవారం భేటీ అయ్యారు. ఉదయం 11.30 సమయంలో.. ప్రధాని అధికారిక నివాసం ఉన్న 7 లోక్ కల్యాణ్ మార్గ్‌కు ఠాక్రే చేరుకున్నారు. మరాఠా రిజర్వేషన్లు, తుపాను సాయం, టీకాలు తదితర అంశాలపై మోదీతో చర్చలు జరిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తగ్గిన కేసులు- ఆంక్షలు సడలింపు
ఉత్తర్‌ప్రదేశ్‌లో కర్ఫ్యూ నిబంధనలను బుధవారం సడలించారు. దాదాపు 75 జిల్లాల్లో 600 కంటే తక్కువ కేసులు నమోదైన కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సడలింపులు అమల్లో ఉంటాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గాంధీ మునిమనవరాలికి జైలుశిక్ష
మహాత్మా గాంధీ మునిమనవరాలు ఆశిష్ లతా రాంగోబిన్కు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. దక్షిణాఫ్రికాలో ఉంటున్న ఆమెను మోసం, ఫోర్జరీ కేసులో దోషిగా తేల్చింది స్థానిక న్యాయస్థానం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మృగశిరతో రద్దీగా మార్కెట్లు