1. కేసులు తగ్గాయి
రాష్ట్రంలో మరో 5,186 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 38 మంది మృతి చెందారు. ప్రస్తుతం 68,462 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహమ్మారి నుంచి మరో 7,994 కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. టీకా కష్టాలు
టీకా కోసం వచ్చే ప్రజల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. గంటల కొద్ది వేచి చూసిన వ్యాక్సిన్ తీసుకోవడం కత్తిమీద సాములా మారింది. రాష్ట్రవ్యాప్తంగా రెండో డోసు టీకా కార్యక్రమం ప్రారంభం కాగా... తెల్లవారుజామునుంచే ప్రజలు బారులు తీరారు. చాలా చోట్ల కేంద్రాలన్నీ జనాలతో కిక్కిరిసి పోగా భౌతిక దూరం నిబంధనలు పాటించకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్‌తో పాటు అన్నీ చోట్ల దాదాపు అదే పరిస్థితి కనిపించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ఏపీలో 20 వేల పైనే.!
రాష్ట్రంలో కొత్తగా 20,065 కరోనా కేసులు, 96 మరణాలు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 1,01,571 కరోనా పరీక్షలు చేశారు. వైరస్ కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 14, విశాఖ జిల్లాలో 12 మంది మృతి చెందారు. విశాఖ జిల్లాలో అత్యధికంగా 2,525, తూర్పు గోదావరి జిల్లాలో 2,370, చిత్తూరులో 2,269 కరోనా కేసులు నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ఆకలి తీరుస్తున్నారు
అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పదంటారు. కరోనా వేళ సొంతవారుసైతం పట్టించుకోని ఈ సమయంలో ఎంతో మందికి అండగా నిలుస్తోంది.. ఆశ్రీ ఫౌండేషన్. కొవిడ్ బాధితులకు ఉచితంగా ఆహారం అందిస్తూ ముందుకు వచ్చిందీ ఆ యువజంట. నగరంలో నిత్యం వందలమందికి పౌష్టికాహారం సరఫరా చేస్తూ...... తామున్నామంటూ ధైర్యం నింపుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ఆక్సిజన్‌పై టాస్క్‌ఫోర్స్
దేశవ్యాప్తంగా ఆక్సిజన్ అవసరాలు, సరఫరాపై జాతీయ స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది సుప్రీం కోర్టు. దేశంలో ఆక్సిజన్ అవసరాలను అంచనా వేసి టాస్క్‌ఫోర్స్ సిఫార్సు చేయనుంది. వివిధ విభాగాలకు చెందిన 12 మంది నిపుణులను సభ్యులుగా నియమించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.