1. ఒకే కుటుంబంలో 27 మందికి...
రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. అజాగ్రత్తతో కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సిరిపూర్‌లో కొవిడ్ కలకలం సృష్టించింది. ఒకే కుటుంబానికి చెందిన 27 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
2. తమిళనాడులో పసుపు బోర్డా!
జగిత్యాలలో పసుపు పండితే తమిళనాడులో పసుపు బోర్డు పెడతారా అని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ పసుపు బోర్డు తీసుకురాలేని పక్షంలో రాజీనామా చేస్తానని చెప్పి మాట మార్చారని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ఏఎస్సై మరణంపై గవర్నర్ సంతాపం...
కూకట్పల్లి ఏఎస్సై మహిపాల్ రెడ్డి మరణంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విచారం వ్యక్తం చేశారు. మహిపాల్ రెడ్డి కుటుంబానికి ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
4. పదవుల్లో మహిళలకు పెద్దపీట...
కార్పొరేషన్లు మున్సిపల్ పదవుల్లో మహిళలకు పెద్దపీట వేసినట్లు ఏపీ సీఎం జగన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌వ్యాప్తంగా మహిళలకు 61 శాతం పదవులు కేటాయించినట్లు స్పష్టం చేశారు. విజయవాడలో మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లకు నిర్వహిస్తున్న ఓరియంటేషన్ తరగతుల కార్యక్రమానికి సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
5. దీదీ... స్థానం మార్చుకుంటున్నారా...
ఎన్నికల ప్రక్రియలో పాల్గొని బంగాల్ పునరుజ్జీవం కోసం ప్రజలు బాటలు పరుస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమను బయటి వ్యక్తులుగా పేర్కొంటూ మమత చేస్తున్న వ్యాఖ్యలను తప్పుబట్టారు. మమత ఇంకో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారనే వార్తల్లో నిజమెంత అని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి