తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్ @1PM - top ten news

ఇప్పటి వరకు ప్రధాన వార్తలు

top-ten-news-till-now
టాప్​టెన్​ న్యూస్ @1PM

By

Published : Jun 28, 2020, 12:59 PM IST

'ఆయన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు'

తాను ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో సంస్కరణలు తెచ్చిన గొప్ప వ్యక్తి పీవీ నరసింహరావు అని ముఖ్యమంత్రి కేసీఆర్​ కొనియాడారు. ఆయన వ్యక్తిత్వ పటిమను వర్ణించడానికి మాటలు చాలవన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'సమస్యలను అవకాశాలుగా మలచుకుందాం'

దేశంపై కరోనా మహమ్మారి విజృంభన, ప్రకృతి విపత్తులు సంభవిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో విశ్వాసం నింపే ప్రయత్నం చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. మనసులో మాట(మన్​ కీ బాత్​) కార్యక్రమంలో భాగంగా కీలక విషయాలు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భారత​ సైన్యం దీటుగా జవాబిచ్చింది: మోదీ

భారతకు శత్రువును ఎదుర్కోవటం ఎలాగో తెలుసని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. లద్దాఖ్​లోని భూభాగాన్ని ఆక్రమించుకోవాలనుకున్న వారికి భారత సైన్యం దీటైన సమాధానం చెప్పిందన్నారు. సైన్యం సత్తా చాటిందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'పీవీ నరసింహరావు తెలుగుజాతికే గర్వకారణం'

ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి దేశానికే ప్రధానిగా ఎదిగిన పీవీ నరసింహరావు తెలుగు వారికి గర్వకారణమని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్​కుమార్​ రెడ్డి కొనియాడారు. పీవీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా గాంధీభవన్​లో ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రెండున్నరేళ్లకే 'ఇండియా బుక్'​లో చోటు.. ఎలా సాధ్యం?

పువ్వు పుట్టగానే పరిమళిస్తుందనే సామెతకు చక్కటి ఉదాహరణ ఈ చిన్నారి. సరిగ్గా మాటలు కూడా రాని వయస్సులో అబ్బుర పరిచే ప్రతిభ కనబరుస్తోంది. తన జ్ఞాపకశక్తితో రెండున్నరేళ్లకే 'ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అరకోటి మందికి 'అమ్మ'గా ఆ దేశ ప్రధాని

'పాలిచ్చి పెంచిన తల్లులకి.. పాలించడం ఓ లెక్కా' అన్నాడో సినీ రచయిత. ఆ మాటల్ని అక్షరాలా నిజం చేశారు న్యూజిలాండ్‌ ప్రధాని జసిండా ఆర్డెర్న్‌. 37 ఏళ్ల వయసులో ఆ దేశ ప్రధాని పీఠమెక్కిన జసిండా పట్టుదలకు ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నిగనిగలాడే జుట్టు కోసం ఇలా ప్రయత్నించండి...

అమ్మాయిలకు జుట్టుతోనే అందం. అందుకే వాళ్లకు జుట్టు అంటే మహాఇష్టం. ఎంతో అపురూపంగా చూసుకుంటారు. జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే వాతావరణంలోని మార్పులు వల్ల జుట్టు పొడిబారడం, రాలిపోవడం, చిట్లిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాకాకూడదంటే.... పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'ఆరేళ్లలో ధోనీ కెప్టెన్సీలో చాలా మార్పులు'

కెప్టెన్సీ అందుకున్న తర్వాత ధోనీ విషయంలో చాలా మార్పులొచ్చాయని చెప్పాడు మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్. అతడిలో ప్రశాంతత అలవడిందని, బౌలర్లు తమను తాము తీర్చిదిద్దుకునేలా తయారుచేశాడని వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అందం 'అమ్మలు' అయితే... మీలా ఉందా అన్నట్టుందే...

అమ్మతనాన్ని ఆస్వాదించడాన్ని ప్రతి మహిళా అదృష్టంగా భావిస్తుంది. కానీ, ప్రసవం అయ్యాక ఆమెలో హార్మోన్లు మారిపోతాయి. బిడ్డను చూసుకోవడంలో బిజీ అయిపోయి.. జీవన విధానమే మారిపోతుంది. కానీ, తల్లైన తర్వాత కూడా ఆడవారు జీవితంలో ఆరోగ్యంగా ముందుకు సాగొచ్చని నిరూపించారు ఆ బాలీవుడ్​ సూపర్​ మామ్​లు. మరి ఆ అందమైన అమ్మలెవరో చూసేద్దాం రండి.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details